వ్యక్తిగత గోప్యత అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇది ప్రాధమిక హక్కుగానే పరిగణించాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పింది. అయితే దీన్ని ఇతర ప్రాధమిక హక్కుల్లా సంపూర్ణమైనదిగా పరిగణించలేమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.ఎస్ ఖేహర్ నేతృత్వంలోని 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం గురువారం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ ప్రజలందరిపై ప్రభావం చూపగల ఈ అంశంపై 547 పేజీల తీర్పులో అనేక విషయాలను ప్రస్తావించింది. వ్యక్తుల గౌరవ ప్రద జీవితానికి గోప్యత అనేది చాలా తప్పనసరి విషయమని కోర్టు అభిప్రాయపడింది. తాను ఎలా నడుచుకోవాలి..ఎలా బతకాలన్న దానిపై ప్రభుత్వం నిద్దేశించాలని ఏ పౌరుడు కోరుకోడంటూ ప్రజల మనోభావాలను అత్యున్నత ధర్మాసనం తన తీర్పు ద్వారా చాటి చెప్పింది. గోప్యత విషయంలో ప్రభుత్వానికి ఉండే  పరిమితుల్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. 


గోప్యత హక్కు ఇతర ప్రాధమిక హక్కుల్కా ఇది సంపూర్ణమైనది కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే అనుమతించ దగ్గ ఆంక్షలు అనే గీటు రాయిని తట్టుకొని నిలబడాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ఇదే సందర్భంలో రాజ్యాంగం ప్రకారం వ్యక్తిగత గోప్యత హక్కు అనే సాధారణ, లేదా ప్రాథమిక హక్కు లేదన్న కేంద్ర ప్రభుత్వ వాదనను కోర్టు తోసిపుచ్చింది. 



 ప్రభుత్వం అమలు చేసే  వివిధ సామాజిక పథకాలను పొందడానికి ఆధార్ తప్పనిసరి చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘంగా విచారించిన అనంతరం అత్యున్నత ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరింది