Secunderabad Agnipath Violence Case: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నరసారావుపేటకు చెందిన సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావు కస్టడీ ముగిసింది. సుబ్బారావు, అతని ముగ్గురు అనుచరులను రైల్వే పోలీసులు రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ముగ్గురి కస్టడీ ముగియడంతో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సికింద్రాబాద్‌ విధ్వంసం వెనుక ఆవుల సుబ్బారావు, అతని అనుచరుల పాత్రకు సంబంధించి పోలీసులు పలు కోణాల్లో వారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విధ్వంసానికి ఎలా ప్లాన్ జరిగింది.. విద్యార్థులను ఎలా ఉసిగొల్పారు.. ఎవరెవరితో ఫోన్‌లో మాట్లాడారు.. లాంటి అంశాలపై పోలీసులు కూపీ లాగినట్లు సమాచారం. అయితే ఆవుల సుబ్బారావు మాత్రం సికింద్రాబాద్ విధ్వంసం ఘటనతో తనకెటువంటి సంబంధం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. తనను కావాలనే ఈ కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని సుబ్బారావు ఆరోపించినట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితం నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లోనూ సుబ్బారావు ఇదే పేర్కొన్నారు. తనకేమీ తెలియదని.. పోలీసులే తనను ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. 


త్రివిధ దళాల్లో సైనిక నియామకాలకు కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చి విధ్వంసానికి దారితీసిన సంగతి తెలిసిందే. గత నెల 18న జరిగిన ఈ ఘటనకు ఆవుల సుబ్బారావు ప్రధాన సూత్రధారి అనే ఆరోపణలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు డిఫెన్స్ అకాడమీలు నిర్వహిస్తున్న సుబ్బారావు.. కేంద్రం తీసుకొచ్చిన స్కీమ్‌తో తమ సంస్థలకు నష్టం జరుగుతుందని భావించి విద్యార్థులను ఆందోళనలకు ఉసిగొల్పారనే ఆరోపణలున్నాయి. ఆందోళనలకు కొద్దిరోజుల ముందే సుబ్బారావు హైదరాబాద్ వచ్చి విధ్వంసానికి ప్లాన్ చేసినట్లు ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో గత నెల 24న సుబ్బారావును పోలీసులు అరెస్ట్ చేశారు. కేసులో అతన్ని ఏ64గా చేర్చారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.


Also Read: Heavy Rains: తెలంగాణలో కుండపోత.. ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. వరదలతో ఖమ్మం, సూర్యాపేట అతలాకుతలం


Also Read: Horoscope Today July 8th: నేటి రాశి ఫలాలు.. ఈ 3 రాశుల వారిని ఇవాళ నెగటివిటీ వెంటాడుతుంది


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య,     ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook