'కరోనా వైరస్' ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్ డౌన్ పరిధిలోకి వెళ్లిపోయాయి. భారత దేశం కూడా 21 రోజులపాటు లాక్ డౌన్ పకడ్బందీగా పాటిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో  ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఉదయం 2 గంటలు... సాయంత్రం మరో 2 గంటలు మాత్రం నిత్యావసర వస్తువుల కోసం బయటకు వచ్చేందుకు అనుమతి ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆస్పత్రులు, పాల కేంద్రాలు, ప్రజలకు రేషన్ సరుకులు అందించే చౌకధరల దుకాణాలు, మెడికల్ షాపులు తప్ప అన్నీ మూసివేసే ఉన్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా స్వీయ నిర్బంధం చేసుకున్నారు. మరోవైపు నిత్యావసర సరుకుల కోసం బయటకు వచ్చిన వారు కూడా  దుకాణాలు, రైతుబజార్ల వద్ద సామాజిక దూరం పాటిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా బయట తిరిగినా పోలీసులు నయానో భయానో వారిని ఇళ్లకు తిరిగి  పంపిస్తున్నారు. 


మరోవైపు ముంబైలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. దీంతో ఎప్పుడూ రద్దీగా ఉండే ముంబై రోడ్లు నిర్మానుష్యంగా తయారయ్యాయి. ఇందుకు సంబంధించిన డ్రోన్ చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సముద్ర తీరం అంతా నిర్మానుష్యంగా ఉంది. ఆ చిత్రాలు మీరూ చూడండి..



జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..