Pegasus Spyware: పెగసస్ స్పైవేర్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన జర్నలిస్టులు
Pegasus Spyware: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న, వివాదాస్పద పెగసస్ స్పైవేర్‌పై సుప్రీంకోర్టులో మరో పిటీషన్ దాఖలైంది. పెగసస్ ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ పాత్రపై నిగ్గు తేల్చాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Pegasus Spyware: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న, వివాదాస్పద పెగసస్ స్పైవేర్‌పై సుప్రీంకోర్టులో మరో పిటీషన్ దాఖలైంది. పెగసస్ ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ పాత్రపై నిగ్గు తేల్చాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇజ్రాయిల్ కంపెనీ తయారు చేసిన పెగసస్ స్పైవేర్ (Pegasus spyware)సాఫ్ట్‌వేర్ ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమవుతోంది. పెగసస్ స్పైవేర్‌తో దేశంలోని ప్రముఖ రాజకీయనేతలు, జర్నలిస్టులు, ప్రజా సంఘాల నేతలు, న్యాయమూర్తులు తదితరుల ఫోన్లపై నిఘా పెట్టారనేది ప్రధాన ఆరోపణగా ఉంది. ఈ అంశంపై ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)విచారణ కమిటీ నియమించారు. మరోవైపు సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ నేపధ్యంలో మరో పిటీషన్ దాఖలైంది సుప్రీంకోర్టులో. పెగసస్ స్పైవేర్‌తో ప్రముఖుల ఫోన్ల హ్యాకింగ్‌లో మోదీ ప్రభుత్వం పాత్రను బహిర్గతం చేయాలంటూ ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.స్పైవేర్ సాఫ్ట్‌వేర్ లైసెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే దర్యాప్తు, విచారణ సంస్థలు గానీ కొనుగోలు చేశాయా లేదా, వాక్ స్వాతంత్య్రాన్ని, భావ వ్యక్తీకరణను హరించాయా అనేది తేల్చాలని జర్నలిస్టులు పిటీషన్‌లో కోరారు.
సిట్టింగ్ జడ్జ్ లేదా మాజి జడ్జి నేతృత్వంలో కేసు విచారణకు ఆదేశించాలని సుప్రీంకోర్టు(Supreme Court)ను కోరారు. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ కేంద్ర ప్రభుత్వం(Central government) లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ స్పైవేర్‌ను వినియోగించాయా లేదా అనేది స్పష్టం చేయాలని సుప్రీంకోర్టును అభ్యర్ధించారు. ఇండియాలో 142 మందిపై నిఘా కొనసాగిందని ప్రముఖ విదేశీ ప్రచురణ సంస్థలు ఇప్పటికే నివేదిక వెలువరించిన సంగతిని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Also read: Basavaraj Bommai: కర్ణాటకకు కొత్త సీఎం బసవరాజ్ బొమ్మై
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook