కరోనావైరస్ ( Coronavirus) ప్రపంచం వ్యాప్తంగా కోట్లాది మందిని ఇబ్బందుల్లోకి నెట్టింది. లక్షలాది మంది మరిణించారు. భారత దేశంలో 33 లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇలాంటి సమయంలో కోట్లాది మంది భారతీయులు వ్యాక్సిన్ కోసం వేచి చూస్తున్నారు.



పూణెకు చెందిన సీరం ఇన్ స్టిట్యూట్ ( Serum Institute ) , ఆక్స్ ఫర్ట్ నిర్వహిస్తున్న ట్రయల్స్ ప్రస్తుతం వేగాన్ని పుంజుకున్నాయి. అయితే హ్యూమన్ ట్రయల్స్ గురించి, టీకా విడుదల తేదీ గురించి ప్రస్తుతం పలు వార్తలు వస్తున్నాయి. దీనిపై సీరం ఇన్ స్టిట్యూట్ సీఈఓ ఒక విజ్ఞప్తి చేశారు.



ప్రస్తుతం ట్రయల్స్ జరుగుతున్నాయి అని.. ఇలాంటి సమయంలో ఏదైనా సమాచారం పంచాల్సి ఉంటే అది త్వరలో అందరితో షేర్ చేస్తాము అని... అప్పటి వరకు ఒపిక పట్టాలి అని కోరారు. రెండు నెలలు ఓపిక పట్టండి.. ఏమన్నా ఉంటే స్వయంగా వెల్లడిస్తాం అని సీరం సీఈఓ అదర్ పూణెవాలా. కొన్ని మీడియా సంస్థలు కోవిడ్-19 ( Covid-19)  ట్రయల్స్ గురించి, టీకా ఏ లెవల్ లో ఉందో అని పలు వార్తలు ప్రచురిస్తున్నాయి. దాంతో ఇలా ట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చారు.