Covishield booster dose: దేశంలో బూస్టర్​ డోస్​గా కోవిడ్​షీల్డ్​ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బూస్టర్​ డోస్​ ఇచ్చేందుకు అనుమతులు కోరుతూ కోవిషీల్డ్ వ్యాక్సిన్​ ఉత్పత్తి సంస్థ (Covishield as a booster) సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ ఇండియా (ఎస్​ఐఐ) డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు దరఖాస్తు చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దరఖాస్తులో ఏముందంటే..


ప్రస్తుతం దేశీయ అవసరాలకు సరిపడా వ్యాక్సిన్ నిల్వలు ఉండటం సహా.. కొత్త వేరయంట్​ భయాలతో బూస్టర్​ డోస్​కు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో మూడో డోస్​ ఇచ్చేందుకు అనుమతులు ఇవ్వాలని సీరమ్​ (Serum Institute of India) దరఖాస్తులో పేర్కొన్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది.


ఈ మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) డైరెక్టర్ ప్రకాశ్​ కుమార్​ సింగ్​ ముందుకు అప్లికేషన్ పంపినట్లు (Drugs Controller General of India) సమాచారం. ఈ లేఖలో యూకేకు చెందిన మెడిసిన్ హెల్త్​కేర్​ ప్రోడక్ట్స్​ రెగ్యులేటరీ ఏజెన్సీ ఇప్పటికే.. బూస్టర్​ డోస్​ ఇచ్చేందుకు ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్​కు అనుమతిచ్చిన విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. 


మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే చాలా దేశాలు వ్యాక్సిన్ బూస్టర్​ డోస్​ (Booster dose of COVID-19 vaccines) ఇవ్వడం ప్రారంభించాయనే విషయాన్ని కూడా నియంత్రణ సంస్థ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.


కోవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న భారత పౌరులతో పాటు ఇతర దేశాల ప్రజలు కూడా బూస్టర్ డోస్​కు అనుమతించాలని కోరుతూ తమకు ఇటీవల వినతులు వెల్లువెత్తుతున్న విషయాన్ని ప్రకాశ్​ కుమార్​ సింగ్​ ముందుకు తీసుకెళ్లినట్లు వెల్లడైంది.


ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు తమను తాము కరోనా నుంచి కాపాడుకునేందుకు మూడో తీసుకునే అవకాశం కల్పించాలని సీరమ్​ అప్లికేషన్​లో పేర్కొన్నట్లు సమాచారం.


రాష్ట్రాల వినతులు..


ఇటీవలే కేరళ, రాజస్థాన్, కర్ణాటక, చత్తీస్​గఢ్​ ప్రభుత్వాలు కూడా.. బూస్టర్​ డోస్​ ఇచ్చేందుకు అనుమతివ్వాలని కేంద్రాన్ని కోరాయి. ఒమిక్రాన్ వేరియంట్ భయాలు పెరిగిపోయిన నేపథ్యంలో ఈ మేరకు ఆయా రాష్ట్రాలు విన్నవించాయి.


బూస్టర్​ డోసుపై ఢిల్లీ హై కోర్టు ఆదేశాలు..


ఢిల్లీ హై కోర్టు కూడా నవంబర్​ 25న బూస్టర్​ డోసుపై కేంద్రం వైఖరి ఏమిటో స్పష్టంగా తెలపాలని ఆదేశించింది. మరోసారి కరోనా రెండో దశ లాంటి పరిస్థితులు రాకుండా చూడాలని కూడా పేర్కొంది.


బూస్టర్​ డోసుపై కేంద్రం ఏమందంటే..


ఇమ్యునైజేషన్​పై నేషనల్​ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్, వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్​పైషనల్​ ఎక్స్​పర్ట్​ గ్రూప్ ప్రస్తుతం.. బూస్టర్​ డోసు ఇవ్వడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయనే విషయాన్ని సైంటిఫిక్​గా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని కేంద్రం పార్లమెంట్​కు సమాచారమిచ్చింది.


Also read: Corona Omicron Variant: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నుండి మిమ్మల్ని కాపాడే పద్ధతులు


Also read: Omicron variant latest updates: కరోనావైరస్‌కి వ్యాక్సిన్ తీసుకోలేదా ? ఐతే కరోనాకు Free treatment లేనట్టే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook