Omicron variant latest updates: కరోనావైరస్‌కి వ్యాక్సిన్ తీసుకోలేదా ? ఐతే కరోనాకు Free treatment లేనట్టే!

Kerala government on Omicron and COVID-19 jabs: కరోనావైరస్ నివారణ కోసం కొవిడ్-19 వ్యాక్సిన్ ఇంకా తీసుకోలేదా ? అయితే ఒకవేళ భవిష్యత్తులో కరోనావైరస్ సోకితే, మీకు ప్రభుత్వం అందించే ఉచిత కరోనా చికిత్స లేనట్టే అంటోంది కేరళ సర్కారు. కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చించేందుకు మందళవారం కేరళ సీఎం పినరయి విజయన్ ఓ అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2021, 10:44 PM IST
Omicron variant latest updates: కరోనావైరస్‌కి వ్యాక్సిన్ తీసుకోలేదా ? ఐతే కరోనాకు Free treatment లేనట్టే!

Kerala government on Omicron and COVID-19 jabs: కరోనావైరస్ నివారణ కోసం కొవిడ్-19 వ్యాక్సిన్ ఇంకా తీసుకోలేదా ? అయితే ఒకవేళ భవిష్యత్తులో కరోనావైరస్ సోకితే, మీకు ప్రభుత్వం అందించే ఉచిత కరోనా చికిత్స లేనట్టే అంటోంది కేరళ సర్కారు. కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చించేందుకు మందళవారం కేరళ సీఎం పినరయి విజయన్ ఓ అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 

ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Kerala CM Pinarayi Vijayan) నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కేరళ సర్కారు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యమైనది ఏంటంటే.. ఇప్పటివరకు కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకోని వారికి ప్రభుత్వం తరపున అందించే ఉచిత కరోనా చికిత్సను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టంచేసింది.

ఒమిక్రాన్ (Omicron treatment) వ్యాప్తి నేపథ్యంలో కేరళలో కొవిడ్-19 మార్గదర్శకాలను మరింత కఠినతరం చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కేరళలో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ అవుతుండగా.. దీనిని 100 శాతానికి పెంచాల్సిందిగా కేరళ సినీ పరిశ్రమ డిమాండ్ చేస్తూ వస్తోంది. అయికే ఒమిక్రాన్ వ్యాప్తి నివారణ కోసం ఈ విషయంలోనూ కఠిన వైఖరినే అవలంభించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

Also read : Omicron symptoms: ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలేంటి, ఏ వయస్సువారికి ప్రమాదకరం

కేరళ సర్కారు వద్ద అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఇప్పటికే కేరళలో 96% మంది కరోనావైరస్ ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకోగా.. 63 శాతం మంది కరోనా రెండు డోసులు తీసుకున్నారు. 1.4 మిలియన్ల మంది కరోనా వైరసె సెకండ్ డోసును (COVID-19 second dose) తీసుకోవాల్సిన తేదీకి తీసుకోలేదు. వాళ్లంతా వీలైనంత త్వరగా రెండో డోసు కూడా తీసుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్ సూచించారు. 

Also read : Sirivennela Sitaramasastry's favourite songs: సిరివెన్నెల సీతారామ శాస్త్రికి నచ్చిన రచయిత, వారి పాటలు

ఇదే విషయమై సమీక్ష సమావేశం అనంతరం సీఎం పినరయి విజయన్ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్లు తీసుకోని వారికి ప్రభుత్వం ఆసుపత్రుల్లో కరోనా చికిత్స లభించదు అని స్పష్టంచేశారు. ఒకవేళ ఏదైనా అనారోగ్య కారణాలు, ఎలర్జీ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ (Side effects of COVID-19 vaccine) కారణాలతో కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారు ఎవరైనా ఉన్నట్టయితే.. వారు ప్రభుత్వ వైద్యుడి వద్ద నుంచి అందుకు సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని విజయన్ తేల్చిచెప్పారు.

ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోనట్టయితే.. వారు ప్రతీ వారం ఎప్పటికప్పుడు ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ రిపోర్టు కాపీతో (RT-PCR test report copy) ఆఫీసుకు రావాల్సి ఉంటుందని సీఎం పినరాయి విజయన్ అన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి (Omicron variant latest news updates) నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగానే ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్టు కేరళ సర్కారు పేర్కొంది.

Also read : Omicron variant news updates : ఒమిక్రాన్ వేరియంట్ ఎందుకింత ప్రమాదకరం, రోగనిరోధకత కూడా పనిచేయదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News