కారు, ట్రక్కు ఢీకొన్న రోడ్డు ప్రమాదం (Road Accident)లో గర్భిణీ సహా ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కర్ణాటకలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం (Karnataka Road Accident) సంభవించింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పడంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. కలబురిగి జిల్లా నవలగి గ్రామ శివారు ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఈ విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రికి వెళ్లాలనే తొందరలో ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. Jaswant Singh Dies: కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గర్భిణీకి నొప్పులు (Pregnant Woman) రావడంతో ప్రసవం కోసం కలబురగికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతులంతా అలంద్ పట్టణానికి చెందిన వారు. గర్భిణీని ఇర్ఫానా బేగం (25) అని గుర్తించారు. జయఛుంబీ(60), రుబియా బేగం (50), అబేదాబి బేగం (50), మునీర్ (28), మహమ్మద్ అలీ (38), షౌకత్ అలీ (29)లను మృతులుగా గుర్తించారు పోలీసులు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. Gold Rate Today: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు 


 


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe