Gujarat Road accident - Seven killed: అహ్మ‌దాబాద్‌: గుజ‌రాత్‌ (Gujarat) లో ఘోర రోడ్డు ప్ర‌మాదం (road accident) సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. గుజరాత్‌లోని సురేంద్ర‌న‌గ‌ర్ జిల్లా (Surendranagar district) ప‌త్డి ప్రాంతంలో కారు, టిప్పర్ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు (Seven people killed ) అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వస్తున్న టిప్పర్.. కారును ఢికొనడంతో కారు పూర్తిగా ధ్వంస‌మైంది. ఈ ఘోర ప్రమాదం గురించి స్థానికులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు పోలీసులు (Police) ఘటనా స్థలానికి చేరుకోని మృతదేహాల‌ను పోస్టుమార్టానికి త‌ర‌లించారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ప‌రారీలో ఉన్న టిప్పర్ డ్రైవ‌ర్ కోసం గాలిస్తున్నట్లు సురేంద్ర నగర్ డిప్యూటీ ఎస్పీ హెచ్‌పీ జోషి తెలిపారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలాఉంటే.. గుజ‌రాత్‌లో గ‌త మూడు రోజుల వ్య‌వ‌ధిలో ఇలాంటి ఘోర ప్ర‌మాదం జరగడం ఇది రెండోసారి. బుధ‌వారం వ‌డోద‌ర‌లో ఎదురెదురుగా వస్తున్న రెండు ట్రక్కులు ఢీకొని 11 మంది మరణించారు. మ‌రో 17 మంది తీవ్రంగా గాయ‌పడ్డారు. అయితే వడోదర ప్రమాదాన్ని మరువకముందే ఇలాంటి మరో ఘోర ప్రమాదం సురేంద్ర‌న‌గ‌ర్ జిల్లాలో జరగడంపై పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. Also raed: Uttar Pradesh: కల్తీ మద్యం తాగి నలుగురు మృతి


Also raed: Chhath Puja: అత్యంత వైభవంగా ఛత్ పూజ


Avantika Mishra: అవంతిక మిశ్రా బ్యూటిఫుల్ పిక్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి