ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో పౌరసత్వ సవరణ చట్టం-2019కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రోజూ వేలాది మంది నిరసనకారులు ఆందోళన నిర్వహిస్తున్నారు. దీనిపై కొద్ది రోజుల క్రితమే.. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం 2019కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని దేశద్రోహులుగా అభివర్ణించారు. తాజాగా షహీన్‌బాగ్‌లో జరుగుతున్న ఆందోళనలపైనా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షహీన్‌బాగ్‌లో ఆందోళనలు దేశానికి పెను ప్రమాదమని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్  అన్నారు. అంతే కాకుండా మరో అడుగు ముందుకేసి .. షహీన్‌బాగ్‌ ప్రాంతాన్ని ఆత్మాహుతి దళాలను తయారు చేసేందుకు వాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు.


మరోవైపు కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేకతను సీరియస్‌గా తీసుకుంది. caa, nrcకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారితో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రకటించారు. మరోవైపు ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు సిద్దమని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ కూడా  తెలిపారు. ఐతే రవి శంకర్ ప్రసాద్ ప్రకటన తర్వాతే  కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 


Read Also: దక్షిణ హైదరాబాద్‌పై ఎందుకీ నిర్లక్ష్యం: అసదుద్దీన్ ఒవైసీ ఆవేదన


అటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా షహీన్‌బాగ్ ఆందోళనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే మరో జలియన్ వాలా‌బాగ్‌లా షహీన్‌బాగ్ ను మారుస్తారని అనుమానం వ్యక్తం చేశారు. దేశద్రోహులను కాల్చిపారేయాలని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను అసదుద్దీన్ ఉటంకించారు.