Shiv Sena: ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన కీలక ప్రకటన చేసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో తన స్టాండ్‌ను వెల్లడించింది. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఉద్దవ్ ఠాక్రే సమావేశమయ్యారు. సభ్యులతా ముర్ముకే మద్దతు ఇవ్వాలని తెలిపారు. దీంతో ఆ పార్టీ అధిష్టానం సైతం సానుకూలత వ్యక్తం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహారాష్ట్రలో పది శాతం మంది దళితులు ఉన్నారు. ఈక్రమంలో రాష్ట్రపతి అభ్యర్థి గిరిజన మహిళ కావడంతో ద్రౌపది ముర్ముకే శివసేన జై కొట్టింది. మొత్తం 22 ఎంపీలకు గాను 16 మంది సభ్యులు షిండే వర్గంలో ఉన్నారు. మిగిలిన వారు ఠాక్రే వెంట నడుస్తున్నారు. మొత్తంగా రాష్ట్రపతి ఎన్నికలపై ఆపార్టీ క్లారిటీ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. 


ప్రతిపక్షం బలంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని ఆయన తెలిపారు. గతంలో ఎన్డీయే అభ్యర్థికి కాకుండా ప్రతిభా పాటిల్‌కు మద్దతు ఇచ్చామని గుర్తు చేశారు. యశ్వంత్ సిన్హా విషయంలోనూ తాము సానుకూలంగా ఉన్నామన్నారు సంజయ్ రౌత్. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో తమ పార్టీ రాజకీయాలను పట్టించుకోవదని మరో ఎంపీ గజానన్‌ కిరిట్కర్ తెలిపారు. 


మరోవైపు మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. శివసేనలో చీలిక రావడంతో ఆ పార్టీ ఎవరికి సొంతం అన్న విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఠాక్రే నుంచి షిండే, ఇతర ఎమ్మెల్యేలు బయటకు వచ్చి..బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల సీఎంగా ఏక్‌నాథ్‌ షిండే ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్‌ బాధ్యతలు చేపట్టారు. ఇక కేబినెట్‌ కూర్పు జరగాల్సి ఉంది.


Also read:Revanth Reddy: ఎకరానికి రూ.15 వేలు ఇవ్వండి..పంట నష్టంపై సీఎం కేసీఆర్‌కు రేవంత్ లేఖ..!


Also read:Relationship Tips: కాబోయే భార్యను తొలిసారి కలవబోతున్నారా... అయితే ఈ టిప్స్ మీకోసమే...



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook