Revanth Reddy: భారీ వర్షాల వల్ల తీవ్ర నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ఈక్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో వరుణుడి వల్ల దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తక్షణమే పంట నష్టాన్ని అంచనా వేయాలన్నారు. నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ.15 వేల చొప్పున ఇవ్వాలని చెప్పారు.
కొత్తగా పంటలు వేసుకునే రైతులకు విత్తనాలు, ఎరువులు, ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు రేవంత్‌రెడ్డి. తదుపరి పంటల నుంచి ప్రభుత్వం ప్రీమియం చెల్లించి పంటల బీమా పథకాల అమలుకు తక్షణం చర్యలు తీసుకోవాలని లేఖలో ప్రస్తావించారు. భారీ వర్షాలు కురుస్తున్న లోతట్టు ప్రాంత ప్రజలను ఆదుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. యుద్ధ ప్రాతిపదికన బాధితులను ఆదుకోవాలన్నారు.
మరోవైపు తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడురోజులుగా పడుతున్న వానలతో నదులు, వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ప్రధాన ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. దీంతో వరద నీటిని దిగువకు వదులుతున్నారు. రాబోయే మూడురోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Also read:Employees Salarys: రెండు వారాలైనా ఉద్యోగులకు నో జీతం.. బంగారు తెలంగాణలో కొత్త అప్పు పుడితేనే మోక్షం
Also read:TS POLYCET: రేపే తెలంగాణ పాలిసెట్ ఫలితాలు..రిజల్ట్‌ను ఇలా చూడొచ్చు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook