Noida Children Disease: ఓ పసి పిల్లవాడిలో ప్రపంచంలోనే తొలిసారి అరుదైన వ్యాధిని గుర్తించారు వైద్యులు. ఈ వ్యాధిని రేయింబవళ్లు కష్టపడి నయం చేశారు. ఆ పసికందును మృత్యుఒడి నుంచి రక్షించి తల్లిఒడిలోకి చేర్చారు. వివరాలు ఇలా.. నోయిడాకు చెందిన ఆనంద్ సోనీ యూపీ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కొడుకు పేరు అయాన్. వయసు 6 నెలలు. తన కుమారుడికి రెండు నెలల వయసు ఉన్నప్పుడు జ్వరం, మూర్చ రావడంతో నోయిడాలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. మొదట అయాన్‌ను పరీక్షించిన వైద్యులు..  బాక్టీరియల్ మెనింజైటిస్‌గా ఉన్నట్లు అనుమానించారు. అయితే అన్ని టెస్టుల నిర్వహించిన తరువాత అలాంటి లక్షణాలు ఏమి కనిపించలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మందులు వాడితే మూర్చలు తగ్గిపోగా.. జ్వరం మాత్రం తగ్గలేదు.  చికిత్స చేసేందుకు గ్లిసికోవిర్ ఇంజెక్షన్ వంటి మందులు ఇచ్చారు. నిరంతరం తమ పర్యవేక్షణలోనే ఉంచుకున్నారు. ఇంకా జ్వరం తగ్గకపోవడంతో మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. చికిత్స అందిస్తున్న వైద్యుడు డాక్టర్ అశుతోష్ సిన్హా మాట్లాడుతూ.. అయాన్ వెన్నుముక నుంచి మరోసారి ద్రవాన్ని తీసి పరీక్షలు నిర్వహించామని చెప్పాఉ. వైద్య భాషలో సెరెబ్రోస్పానియల్ ఫ్లూయిడ్ అంటారని.. టెస్టుల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తేలిందన్నారు. పిల్లలలో కనిపించే రోడోటురులా ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా చాలా అరుదని అన్నారు. ఈ వ్యాధిని నయం చేసేందుకు యాంఫోటెరెసిన్ బి మందులు ఇచ్చామన్నారు. కరోనా సమయంలో వ్యాపించిన బ్లాక్ ఫంగస్‌కు చెక్ పెట్టేందుకు ఈ మందులు ఉపయోగించినట్లు ఆయన గుర్తుచేశారు. 


రెండు నెలల అయాన్‌లో వ్యాధి ఏంటో గుర్తించేందుకు రెండు నెలల సమయం పట్టింది. ఇంతకుముందు ప్రపంచంలో ఏ చిన్నారిలోనూ ఇలాంటి వ్యాధిని గుర్తించలేదని వైద్యులు తెలిపారు. అయాన్‌కు వచ్చిన వ్యాధి మెనింజైటిస్ అంటే మెదడు జ్వరంతో కూడిన ఫంగల్ ఇన్ఫెక్షన్. వ్యాధి వైద్య పేరు రోడోటురులా ఫంగల్ ఇన్ఫెక్షన్ విత్ సీఎంవీ మెనింజైటిస్. బాక్టీరియల్ మెనింజైటిస్ సాధారణంగా పిల్లలలో కనిపిస్తుంది. కానీ ఈ పిల్లవాడికి వైరల్ మెనింజైటిస్ ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.


చికిత్స తరువాత అయాన్ ఆరోగ్యం ఎలా ఉంది..? ఈ వ్యాధి తీవ్రత ఎంతవరకు ఉంటుందని వైద్యులు పరీక్షిస్తున్నారు. చికిత్స కోసం రూ.7 లక్షలు ఖర్చు అయింది. అయాన్ వయసు తక్కువగా ఉండడంతో రెండు నెలలపాటు వేర్వేరు మందులు ఇవ్వడం సాధ్యం కాదని.. చిన్న ఇంజెక్షన్లతో కాన్యులా వేయడం కుదరదని అన్నారు. అందుకే చిన్నసైజు కెమోపోర్టును ఆర్డర్ చేసి అమర్చినట్లు వెల్లడించారు. మరికొంత కాలం ఆ పసికందును పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసువెళ్లాల్సి ఉంటుంది. ప్రాణపాయ స్థితి నుంచి బయటపడడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.


Also Read: YS Sharmila: బీఆర్ఎస్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో చెప్పిన వైఎస్ షర్మిల.. మొత్తం ఎన్ని కోట్లంటే..?  


Also Read: Virat Kohli Vs Gautam Gambhir: విరాట్ కోహ్లీ, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం.. షాకిచ్చిన బీసీసీఐ  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


 ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి