Virat Kohli Vs Gautam Gambhir: విరాట్ కోహ్లీ, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం.. షాకిచ్చిన బీసీసీఐ

BCCI Fined to Gautam Gambhir and Virat Kohli: తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగిన విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్‌లకు బీసీసీఐ షాకిచ్చింది. ఇద్దరి మ్యాచ్‌ ఫీజులో వంద శాతం జరిమానా విధించింది. లక్నో ప్లేయర్ నవీన్-ఉల్-హక్‌కు 50 శాతం జరిమానా పడింది. 

Written by - Ashok Krindinti | Last Updated : May 2, 2023, 02:07 PM IST
Virat Kohli Vs Gautam Gambhir: విరాట్ కోహ్లీ, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం.. షాకిచ్చిన బీసీసీఐ

BCCI Fined to Gautam Gambhir and Virat Kohli: ఇప్పటివరకు ప్రశాంతంగా సాగుతున్న ఐపీఎల్‌ 2023 సీజన్‌లో సోమవారం హైహీట్ కనిపించింది. విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య వాగ్వాదం సంచలనం రేకెత్తించింది. దీంతో బీసీసీఐ కూడా చర్యలు ప్రారంభించింది. విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్‌లకు మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా విధించింది. లక్నో ప్లేయర్ నవీన్-ఉల్-హక్‌కు కూడా మ్యాచ్‌ ఫీజులో 50 శాతం ఫైన్ పడింది. ఇంతకు గ్రౌండ్‌లో ఏం జరిగింది..? మెంటర్‌గా ఉన్న గౌతమ్ గంభీర్‌తో విరాట్ కోహ్లీ ఎందుకు గొడవపడాల్సి వచ్చింది..?

లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య సోమవారం ఉత్కంఠభరిత పోరు జరిగింది. లోస్కోరింగ్ గేమ్ అభిమానులకు మస్త్ మజాను అందించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 9 వికెట్లకు 126 రన్స్ చేసింది. ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ డుప్లెసిస్ (44), కోహ్లీ (31) మాత్రమే రాణించారు. అనంతరం 127 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో..  జట్టు 19.5 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. లక్నో టీమ్‌లో కృష్ణప్ప గౌతమ్ (23) అత్యధిక పరుగులు చేశాడు. గాయం కారణంగా చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ రాహుల్.. షాట్లు ఆడేందుకు ఇబ్బందిపడ్డాడు. అమిత్ మిశ్రా (19) పోరాటం సరిపోలేదు. దీంతో ఆర్‌సీబీ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

లక్నో ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో నవీన్‌ ఉల్‌ హక్‌ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో విరాట్‌ కోహ్లీతో వాగ్వాదానికి దిగాడు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం కూడా ఇద్దరు మరోసారి మాటమాట అనుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్న సమయంలో నవీన్-ఉల్-హక్‌ను కోహ్లీ ఏదో మాట అనగా.. దానికి అతను కూడా గట్టిగా రిప్లై ఇచ్చాడు. వెంటనే మ్యాక్స్‌వెల్ ఇద్దరిని వేరు చేసి పంపించాడు. ఆ తరువాత గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ మధ్య గల్లీ క్రికెట్‌ను తలపించేలా ఘర్షణ పడ్డారు. గంభీర్‌ దూసుకుని వస్తుండగా.. ప్లేయర్లు అడ్డుకున్నారు. ఇద్దరు ఒకరికొకరు వాదించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

 

ఈ ఘటనపై బీసీసీఐ సీరియస్ యాక్షన్ తీసుకుంది. విరాట్ కోహ్లీకి మ్యాచ్‌ ఫీజులో 100 శాతం అంటే.. రూ. 1.07 కోట్ల జరిమానా విధించింది. గౌతమ్‌ గంభీర్‌కు కూడా 100 శాతం ఫైన్ వేసింది. గంభీర్ రూ.25 లక్షలు జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. లక్నో ఆటగాడు నవీన్-ఉల్-హక్‌కు 50 శాతం జరిమానా పడింది. మ్యాచ్ ఫీజులో 50 శాతం అంటే.. రూ.1.79 లక్షలను ఆఫ్ఘాన్ ప్లేయర్ చెల్లించాలి.

Also Read: Telangana Corona Cases: భారీగా తగ్గిన కరోనా కేసులు.. తెలంగాణలో ఎన్నంటే..?  

Also Read: BJP Manifesto Highlights: ఉచితంగా వంట గ్యాస్, పాలు.. ప్రతి వార్డులో నమ్మ క్లినిక్‌లు ఏర్పాటు.. బీజేపీ వరాల జల్లు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

 ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News