YS Sharmila: బీఆర్ఎస్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో చెప్పిన వైఎస్ షర్మిల.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

YS Sharmila Fires on CM KCR: రైతులకు ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తెలంగాణలో అకాల వర్షాలతో నష్టపోతే.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో వర్షాలతో 2 లక్షల 34 వేల ఎకారాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు.  

Written by - Ashok Krindinti | Last Updated : May 2, 2023, 02:31 PM IST
YS Sharmila: బీఆర్ఎస్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో చెప్పిన వైఎస్ షర్మిల.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

YS Sharmila Fires on CM KCR: తెలంగాణ రాష్ట్రంలో 23 జిల్లాల్లో పంట నష్టం జరిగిందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిత తెలిపారు. వరి, మొక్కజొన్న పంటలు , మామిడి తోటల్లో ఎక్కువగా నష్టం జరిగిందన్నారు. మార్చి-ఏప్రిల్లో కురిసిన వర్షాలకు దాదాపు 10 లక్షల ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారని అన్నారు. మహబూబాబాద్, ఖమ్మం, జనగాంలో మూడు రోజులపాటు పంటనష్టంపై వివరాల కోసం పర్యటన చేశామన్నారు. ఈ సందర్భంగా అప్పులు చేసి 30-40 వేలు పెట్టుబడి పెడితే పంటలు ధ్వంసమయ్యాయని రైతులు చెబుతున్నారని చెప్పారు. అకాల వర్షాలతో రైతులకు జరిగిన పంట నష్టంపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. 

'రాబడి అప్పు తీర్చడానికి కూడా సరిపోవని రైతులు చెప్పుకొని బాధపడుతున్నారు. రైతులకు ముల్లు గుచ్చుకుంటే నా పంటితో తీస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు..? ఇది కిసాన్ సర్కార్ అని డబ్బాలు కొట్టుకుంటున్న కేసీఆర్ రాష్ట్రంలో రైతులకు ఏం సమాధానం చెప్తారు..? మార్చిలో ఖమ్మం, వరంగల్ , కరీంనగర్ జిల్లాలలో పంట నష్టం జరిగిందని కేసీఆర్ గాలి మోటార్‌లో తిరిగి గాలి మాటలు  చెప్పాడు. 2 లక్షల 34 వేల ఎకారాల్లో పంట నష్టం జరిగింది. ప్రతి రైతుకు ఎకరాకు 10 వేల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. సాయంత్రం ఇంటికి పోయేలోపు డబ్బులు విడుదల అవుతాయన్నారు. కేసీఆర్ ఇంకా ఇంటికి పోలేదా..?

2 లక్షల 34 వేల ఎకరాలకు 234 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చేయకపోగా ఇప్పుడు మాట మారుస్తూ లక్షా 51 వేల ఎకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగిందని మాట్లాడుతున్నారు. ఏప్రిల్లో పడిన వానలకు మళ్లీ లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగింది. ఏప్రిల్లో 9 లక్షల 60 వేల ఎకరాలకు పంట నష్టం జరిగిందని ఒక అంచనా అయితే కేసీఆర్ లెక్కన ఎకరానికి 10 వేల చొప్పున 960 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాలి. రైతుల దగ్గరికి ఒక్క అధికారి కానీ, ఎమ్మెల్యే కానీ వచ్చింది లేదు, చూసింది లేదు. పంట నష్టం ఇస్తారనే భరోసా మాకు ఎక్కడిది అని రైతులు వాపోతున్నారు. మార్చిలో జరిగిన పంట నష్టంపై అధికారులు సరైన వివరాలు తీసుకోలేదని చెబుతున్నారు. 5 ఎకరాల్లో పంట నష్టపోతే ఒక ఎకరం రాసుకున్నారని తెలిపారు.

అసలు కేసీఆర్ ఏ రోజైనా రైతులను ఆదుకున్నారా..? రైతులకు మునుపటిలా ఇన్‌పుట్ సబ్సిడీ లేదు.. ఎరువుల మీద సబ్సిడీ లేదు, విత్తనాల మీద సబ్సిడీ లేదు. దిక్కుమాలిన కేసీఆర్ పాలనలో పంట బీమా కూడా లేదు. ఈ 9 సంవత్సరాలలో కేసీఆర్ ఒక్క రైతుకైనా, ఒక్క రూపాయైనా పంట నష్టపరిహారం ఇచ్చారా..? రైతులు  తొమ్మిదేళ్లలో 14 వేల కోట్ల రూపాయలు నష్టపోతే కేసీఆర్ ఒక్క రూపాయి అయినా ఇచ్చారా..?' అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. 

Also Read: Virat Kohli Vs Gautam Gambhir: విరాట్ కోహ్లీ, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం.. షాకిచ్చిన బీసీసీఐ  

రైతులు నష్టపోయిన పంటను ట్రక్కులో కేసీఆర్‌కు బహుమతిగా పంపిస్తున్నామని తెలిపారు. రైతులు తమ భార్యల పుస్తెలు తాకట్టుపెట్టి పంట పండిస్తే వచ్చిన ఫలితం ఇది అని అన్నారు. కేసీఆర్ ఫాం హౌజ్ మత్తు వీడాలన్నారు. కేసీఆర్‌కు మాత్రమే పునర్నిర్మాణం అయిందన్న షర్మిల.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కరప్షన్ల చంద్రశేఖర్ రావు అయ్యాడంటూ సెటైర్లే వేశారు. రబ్బరు చెప్పులతో స్కూటర్‌పై తిరిగే కేసీఆర్.. ఇప్పుడు పార్టీ అకౌంట్‌లోనే 1250 కోట్ల రూపాయలున్నాయని చెప్పారు. ఏ డబ్బులు లేని వీళ్లు జాతీయ పార్టీలు పెడుతున్నారని.. ఎన్నికలకు కేసీఆర్‌ను అధ్యక్షుడిని చేస్తే అన్ని పార్టీలకు అన్ని ఎన్నికలకు సంబంధించిన ఖర్చంతా ఈయనే పెట్టుకంటాడట.. ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు..? అని నిలదీశారు.  

Also Read: BJP Manifesto Highlights: ఉచితంగా వంట గ్యాస్, పాలు.. ప్రతి వార్డులో నమ్మ క్లినిక్‌లు ఏర్పాటు.. బీజేపీ వరాల జల్లు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

 ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News