న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ దాదాపుగా రెండు నెలల నుండి కరోనా మహమ్మారి నేపథ్యంలో మూసివేయబడిన విషయం విదితమే. చాలా  కాలం తర్వాత సోమవారం నుండి క్రమానుగత పద్ధతుల్లో సామజిక దూరం పాటిసస్తూ నడుపుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఢిల్లీలో సుమారుగా 100 షాపింగ్ మాల్స్ ఉన్నాయని, ఢిల్లీ ప్రభుత్వానికి 500 కోట్ల రూపాయల ఆదాయ వనరు అని అధికార (Aam aadmi party) ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వ్యాపారి విభాగం కన్వీనర్ బ్రిజేష్ గోయల్ తెలిపారు. ఢిల్లీలోని షాపింగ్ సముదాయాలలో వేల సంఖ్యల్లో పనిచేస్తున్నారని, వారికి సైతం ఉపాధి దొరుకుతుందన్నారు. ఇదిలాఉండగా ఢిల్లీ ప్రభుత్వం మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్వహణను కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరగాలని, ఢిల్లీ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. రణవీర్ పై గుస్సా అయిన దీపికా పదుకొనే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: భగ్గుమన్న పెట్రో, డీజిల్ ధరలు..


మాల్స్ తెరవడానికి ఒక గంట ముందు రిపోర్ట్ చేయాలని, తప్పనిసరిగా స్క్రీనింగ్, ఉద్యోగులకు ఫేస్ షీల్డ్స్, గ్లోవ్స్, శానిటైజర్ అందజేస్తామని ద్వారకాలోని వెగాస్ మాల్ డైరెక్టర్ హర్ష్ వర్ధన్ బన్సాల్ పేర్కొన్నారు. మాల్‌ను సందర్శించే వారు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, మొబైల్ ఫోన్‌లలో ఆరోగ్య సేతు అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం సూచించింది. గర్భిణీ స్త్రీలు, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి ప్రవేశం ఉంటుందన్నారు.


Also Read: మా నుండి మీరు తప్పించుకోలేరు.. కేజ్రీవాల్


ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ స్కానర్లు, శానిటైజర్ డిస్పెన్సర్‌లను ఉంచామని, తప్పనిసరిగా ప్రభుత్వం సూచిస్తున్న మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలుచేస్తామని,  గర్భిణీ స్త్రీలు, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిని, 65 ఏళ్లు పైబడిన వారికి ప్రవేశం అనుమతించమని అన్నారు. నేతాజీ సుభాష్ ప్లేస్ జిల్లా కేంద్రంలోని పీపీ టవర్ చైర్మన్ అర్జున్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి గంటకు ఎలివేటర్లు శుభ్రపర్చే ఏర్పాట్లు చేస్తామని, నలుగురి కంటే ఎక్కువ మందిని అనుమతించబోమని అన్నారు. 


 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..