`వన్ నేషన్ - వన్ పోల్` సాధ్యం కాదన్న ఈసీ
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న భారత జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వినతిపై భారత ఎన్నికల సంఘం స్పందించింది.
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న భారత జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వినతిపై భారత ఎన్నికల సంఘం స్పందించింది. 'వన్ నేషన్ - వన్ పోల్’ విధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వ్యతిరేకించింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని స్పష్టం చేసింది. భారత ప్రధాన ఎన్నికల అధికారి ఓ.పి. రావత్ మాట్లాడుతూ.. 'ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి చట్టసవరణ అవసరం. ఎన్నికల సిబ్బంది, భద్రత, వీవీప్యాట్‌లు అవసరమైతాయి' అని అన్నారు. ఇప్పటికే ఈ విధానంలో చిక్కులు, చట్టసవరణ లాంటి అంశాలపై న్యాయశాఖ పరిశీలించదన్నారు.
దేశవ్యాప్తంగా 'వన్ నేషన్- వన్ ఎలక్షన్' నిర్వహించాలని బీజేపీ భావిస్తున్నది. అందులో భాగంగా రానున్న లోక్‌సభ ఎన్నికలతో పాటు 11 రాష్ర్టాల్లో ఎన్నికలు నిర్వహించాలని మోదీ ప్రభుత్వం యోచిస్తోంది. తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో వచ్చే ఏడాది లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీరికి తోడు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో- రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, హర్యానా, మహారాష్ట్ర, మిజోరం, జార్ఖండ్, బీహార్‌లలోనూ ఎన్నికలు నిర్వహించాలన్నది బీజేపీ ఆలోచన. అయితే, దీనిని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
అటు ఎన్డీఏ మిత్రపక్షమైన జేడీయూ ఏకకాలంలో ఎన్నికల నిర్వహణపై స్పందించింది. లోక్‌సభతో పాటే రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు.