Snake Found in Mid-day Meal: పాము పడిన మధ్యాహ్న బోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మిడ్ డే మీల్స్ నాణ్యతలోనే కాదు.. వంట తయారీలోనూ అడుగడుగునా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. మధ్యాహ్న బోజనం వికటించి స్టూడెంట్స్ ఆస్పత్రులపాలైన ఘటనలు నిత్యం ఏదో ఒక చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ నిర్వాహకులు మేల్కోవడం లేదు. తాజాగా మిడ్ డే మీల్స్ లో పాము పడగా.. అది చూసుకోకుండానే వంట వండి విద్యార్థులకు వడ్డించిన ఘటన పశ్చిమ బెంగాల్లోని బిర్భుమ్ లో చోటుచేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఘటనపై వంట వండిన స్కూల్ సిబ్బందిలో ఒకరు మాట్లాడుతూ.. పప్పు వండిన పాత్రలో పాము పడిన మాట వాస్తవమే అని అంగీకరించారు. పాము పడిన మధ్యాహ్న బోజనం తిన్న తరువాత స్కూల్ స్టూడెంట్స్ ఆహారం వికటించి ఆస్పత్రిపాలయ్యారని స్థానిక అధికారి తెలిపారు. బిర్భుమ్ జిల్లాలోని మయురేశ్వర్ తాలుకాలోని మండల్‌పూర్ ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు సదరు అధికారి పేర్కొన్నారు. అయితే, సోమవారం జరిగిన ఈ ఘటనను బయటికి పొక్కకుండా అధికారులు కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని.. అందువల్లే ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసినట్టు తెలుస్తోంది. స్కూల్లో మిడ్ డే మీల్ నాణ్యత బాగుండంటం లేదని తరచుగా విద్యార్థులు ఫిర్యాదు చేస్తున్నారని.. ఈ ఘటనతో స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యం బట్టబయలైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 


పాము పడిన ఆహారం తిన్న ఘటనలో 30 మంది వరకు విద్యార్థులు అస్వస్థతకు గురికాగా.. పాఠశాల సిబ్బంది, స్థానిక అధికార యంత్రాంగం వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. జిల్లా ప్రైమరి స్కూల్ కౌన్సిల్ చైర్మన్ పి నాయక్ మాట్లాడుతూ.. తాను కూడా ఆస్పత్రికి వెళ్లి విద్యార్థులతో, వారి తల్లిదండ్రులతో మాట్లాడానని.. ప్రస్తుతం పిల్లలు కోలుకుంటున్నారని అన్నారు. ఒక్క విద్యార్థి మినహా అందరూ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని.. ఆ ఒక్క విద్యార్థి పరిస్థితి కూడా నియంత్రణలోనే ఉందని అధికారులు తెలిపారు. 


ఇదే పశ్చిమ బెంగాల్లోని మాల్డా జిల్లాలో ఇటీవలే మధ్యాహ్న ఆహారంలో ఎలుక, బల్లి పడిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనపై మాల్డా జిల్లా కలెక్టర్ నితిన్ సింఘానియా స్పందిస్తూ.. మధ్యాహ్న బోజనంలో బల్లి, ఎలుక పడిన ఘటన తమ దృష్టికి వచ్చాయని.. వెంటనే అందుకు బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది అని అన్నారు. దేశం నలుమూలలా తరచుగా ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నప్పటికీ... మధ్యాహ్న బోజనం పథకం నిర్వహణపై నిఘా కొరవడటం అనేక విమర్శలకు తావిస్తోంది.


ఇది కూడా చదవండి : H3N2 Virus: వైరల్ ఫీవర్‌ను కరోనాగా భయపడుతున్న జనాలు.. హెచ్3ఎన్2 పాసిటివ్ జాగ్రత్తలు ఇవే!


ఇది కూడా చదవండి : Budget Facts: దేశపు తొలి బడ్జెట్ , అతి పెద్ద బడ్జెట్ ఎప్పుడు, బడ్జెట్ సంబంధించిన ఆసక్తికర అంశాలు


ఇది కూడా చదవండి : Vandebharat Express: విశాఖపట్నం వరకూ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు, ఎక్కడెక్కడ ఆగుతుందంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook