Southwest Monsoon: భారత వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. దేశంలోకి నైరుతి రుతుపవనాలు వచ్చినట్లు వెల్లడించింది. ఇవాళ కేరళను నైరుతి రుతుపవనాలు తాకాయి. సాధారణం కంటే మూడురోజుల ముందుగానే ఆ రాష్ట్రాన్ని పలకరించింది. ఇటీవల అసని తుపాను కారణంగా రుతుపవనాలు వేగంగా కదలాయి. అంతకంటే ముందే అండమాన్ దీవులకు రుతుపవనాలు చేరాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు తాకేందుకు వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.  వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల రాకతో ఏపీ, తెలంగాణలో మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. రాగల మూడురోజులపాటు వాతావరణం ఇలాగే ఉంటుందని వెల్లడించింది.


గతకొంతకాలంగా తెలంగాణలో వాతావరణంలో మార్పులు కనిపిస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడి భగభగలు కొనసాగుతుంటే..సాయంత్రం వేళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ఈదురుగాలులు సైతం వీస్తున్నాయి. మరికొన్ని రోజులపాటు హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో వాతావరణం ఇలాగే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దేశంలో నైరుతి రుతుపవనాల విస్తృతి అధికంగా ఉండటంతో తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.


Also read:Ajwain Water Benefits: వాము నీరు తాగడం వల్ల శరీరానికి ఎన్ని రకాల ప్రయోజనాలున్నయో తెలుసా..?


Also read: Osmania University: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఓయూ.. ఆరుగురు అరెస్ట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


 


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook