Delhi Rains Alert: దేశ రాజధాని నగరం భారీ వరదల్లో చిక్కుకుంది. గతంలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలుతో నగరం అతలాకుతలమౌతోంది. ఎంపీల ఇళ్లు కూడా నీట మునిగిపోయిన పరిస్థితి. భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్ర కూడా నిలిచిపోయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నైరుతి రుతుపననాల ప్రభావంతో ఉత్తరాది కొట్టుకుపోయేంత భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రెండ్రోజుల్నించి కురుస్తున్న భారీ వర్షాలతో దేశ రాజధాని నగరం నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమై జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. తీవ్రమైన ట్రాఫిక్‌లో నగరం ఇరుక్కుంది. లోధీ రోడ్‌లో కొంతమంది ఎంపీల ఇళ్లు కూడా నీట మునిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఢిల్లీలోని లజ్‌పత్ నగర్ సహా చాలా ప్రాంతాల్లో జనజీవనం స్థంభించిపోయింది. 


గత రెండ్రోజులుగా ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రాజధాని నగరంలో జలమయమౌతోంది. బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీలోని ఐటీవో వద్ద రోడ్డుపై 2 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. 


భారీ వర్షాల కారణంగా ఢిల్లీలో స్కూళ్లు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. 41 ఏళ్ల తరువాత రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో ఢిల్లీలో 153 మిల్లీమీటర్ల వర్షం పడింది.  1982 జూలైలో ఢిల్లీని అతలాకుతలం చేసిన వర్షాలు తిరిగి ఇప్పుుడు ఆ స్థాయిలో వణికిస్తున్నాయి. భారీ వర్షాలు మొత్తం ఉత్తరాదిపై ప్రభావం చూపిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా వరద బీభత్సం సృష్టిస్తోంది. బియాస్ నది ఉదృతంగా ప్రవహిస్తూ లోతట్టు ప్రాంతాల్ని ముంచెత్తుతోంది. డిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌తో పాటు పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్‌లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రానున్న రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముప్పు పొంచి ఉంది. 


Also read: Heavy Floods: భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్‌లో వరద బీభత్సం, మార్కెట్లు, ఇళ్లు, వంతెనలు కొట్టుకుపోతున్న దృశ్యాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook