Spicejet: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనుగొనడమే ఒక ఎత్తైతే..ఆ వ్యాక్సిన్ రవాణా మరో ఎత్తు. ఇప్పుడు వ్యాక్సిన్ రవాణా కోసం ప్రపంచ దేశాలు సిద్ధమవుతున్నాయి. అందుకే స్పైస్‌జెట్ విమానయాన సంస్థ ప్రత్యేక కార్గో సర్వీసుల్ని ప్రారంభించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వైరస్ ( Corona virus ) మహమ్మారి అంతానికి వ్యాక్సిన్ సిద్ధమైంది. ఇప్పుడిక రవాణా కీలకంగా మారింది. వ్యాక్సిన్ సరఫరా ( Vaccine transportation ) చాలా జాగ్రత్తతో కూడిన వ్యవహారం. ఎందుకంటే కోల్డ్‌ఛైన్ ( Cold chain ) కచ్చితంగా మెయింటైన్ అవ్వాల్సి ఉంది.  అందుకే ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ( Spicejet ) ప్రత్యేక కార్గో సంస్థ స్పైస్ ఎక్స్‌ప్రెస్ స్పైస్ ఫార్మా ప్రో పేరుతో సర్వీసుల్ని ప్రారంభించింది. వ్యాక్సిన్ సరఫరా కోసం ఓం లాజిస్టిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 


కోవిడ్ 19 వ్యాక్సిన్ ( Covid 19 vaccine ) ‌ను వేగంగా డెలివరీ ఇవ్వడమే కాకుండా దేశీయంగా అంతర్జాతీయంగా స్థిరమైన కోల్డ్‌ఛైన్ నెట్‌వర్క్‌ను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుందని స్పైస్‌జెట్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 12 వందల కార్యాలయాలతో ఓం లాజిస్టిక్స్‌కు ( Om logistics ) ప్రత్యేకత ఉంది. అంతర్జాతీయంగా మైనస్ 40 డిగ్రీల నుంచి 25 డిగ్రీల సెల్సియస్ వరకూ వ్యాక్సిన్‌ను జాగ్రత్తగా నిల్వ చేయాల్సి ఉంటుంది. స్పైస్ ఎక్స్‌ప్రెస్ అంతర్జాతీయంగా పలు కోల్డ్‌ఛైన్ సొల్యూషన్స్‌తో ఒప్పందం చేసుకుంది. అందుకే ఓం లాజిస్టిక్స్‌తో భాగస్వామ్యమైంది. రిఫ్రిజిరేటెడ్ ట్రక్కుల్ని ఓం లాజిస్టిక్స్ సమకూరుస్తుంది.  


దేశీయ, అంతర్జాతీయ నెట్వర్క్ ద్వారా రోజుకు 5 వందల టన్నుల సామర్ధ్యం కలిగిన సరుకు రవాణా చేయవచ్చని స్పైస్‌జెట్ సంస్థ తెలిపింది. సున్నితమైన డ్రగ్ వ్యాక్సిన్‌ను సమర్ధవంతంగా కోల్ట్‌ఛైన్ మెయింటైన్ చేస్తూ సరఫరా చేయగలమని స్పైస్‌జెట్ చెబుతోంది. Also read: Attack on jp nadda: దాడిపై విచారణకు ఆదేశించిన హోంమంత్రి అమిత్ షా, 12 గంటల్లో నివేదిక సమర్పించాల్సిందే