శ్రీదేవి గుండెపోటుతో చనిపోలేదా ? డెత్ సర్టిఫికెట్ లో కొత్త ట్విస్ట్
శ్రీదేవి మృతి కేసులో వెలుగుచూసిన ఈ కొత్త ట్విస్ట్ ఇంకెన్ని మలుపులకు దారితీయనుందో
బాలీవుడ్ నటి శ్రీదేవి మృతి కేసులో ఓ కొత్త కోణం వెలుగుచూసింది. ఆమె గుండెపోటుకు గురై మృతిచెందినట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. శనివారం రాత్రి ఆమె మృతిచెందిన రోజు ఎటువంటి నెగటివ్ సంకేతాలు వెలువడనప్పటికీ.. ఆదివారం రాత్రి సమయానికి శ్రీదేవి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ మీడియాలో పలు కథనాలు వచ్చాయి. సోషల్ మీడియాలోనూ శ్రీదేవి అభిమానాలు పలు అనుమానాలు వ్యక్తంచేశారు. మీడియా కథనాలను బలపర్చుతూ తాజాగా దుబాయ్ లో అక్కడి స్థానిక అధికారులు ఇచ్చిన డెత్ సర్టిఫికెట్ మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. శ్రీదేవి గుండెపోటుతో చనిపోయారని ఇప్పటివరకు ప్రచారం జరిగినప్పటికీ.. దుబాయ్ వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ప్రివెంటివ్ మెడిసిన్ విభాగం ఇచ్చిన డెత్ సర్టిఫికెట్ మాత్రం ఆమె గుండెపోటుతో చనిపోయినట్టుగా ఎక్కడా పేర్కొనలేదు.
శ్రీదేవి బోనీకపూర్ అయ్యప్పన్ ( శ్రీదేవి పూర్తి పేరు ) ప్రమాదవశాత్తుగా నీళ్లలో మునిగి చనిపోయారని దుబాయ్ లోని ప్రివెంటివ్ మెడిసిన్ విభాగం డైరెక్టర్ జారీ చేసిన డెత్ సర్టిఫికెట్ కాపీ మీడియాకు చిక్కింది.
శ్రీదేవి మృతి కేసులో వెలుగుచూసిన ఈ కొత్త ట్విస్ట్ ఇంకెన్ని మలుపులకు దారితీయనుందో వేచిచూడాల్సిందే.