Corona New Strain: పొరుగుదేశంలో ప్రమాదకర కరోనా వైరస్ గుర్తింపు, ఇండియాలో ఆందోళన
Corona New Strain: కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో గజగజవణికిపోతున్న ఇండియాకు పొరుగుదేశం నుంచి అందిన వార్త మరింతగా కలకలం రేపుతోంది. గాలి ద్వారా వ్యాపించే కొత్తరకం వైరస్ గుర్తించినట్టు ఆ దేశం ప్రకటించడమే దీనికి కారణం.
Corona New Strain: కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో గజగజవణికిపోతున్న ఇండియాకు పొరుగుదేశం నుంచి అందిన వార్త మరింతగా కలకలం రేపుతోంది. గాలి ద్వారా వ్యాపించే కొత్తరకం వైరస్ గుర్తించినట్టు ఆ దేశం ప్రకటించడమే దీనికి కారణం.
ఇండియాలో కరోనా( Indian Corona Crisis) ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా సెకండ్ వేవ్( Corona Second Wave) భయంకరంగా విస్తరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇండియాలో రికార్డు స్థాయిలో రోజుకు 3.5 లక్షల కేసులు నమోదవుతుండటంతో ప్రపంచమంతా ఇండియాలో పరిస్థితులపై ఆందోళన చెందుతోంది. ఈ తరుణంలో పొరుగుదేశం శ్రీలంక (Srilanka) చేసిన ప్రకటన ఇండియాను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. గాలి ద్వారా వ్యాపించే కొత్త రకం కరోనా వైరస్( New Coronavirus strain)ను తమ దేశంలో గుర్తించినట్లు (Srilanka Detected new potential virus strain) శ్రీలంక వైద్య నిపుణులు తెలిపారు. మునుపటి కరోనాతో పోలిస్తే ప్రస్తుతం దీని ప్రభావం, వ్యాప్తి అధికంగా ఉన్నట్లు శ్రీలంక వైద్యులు చెప్పారు. ఇది గాల్లో దాదాపు గంటపైనే మనుగడ సాగించగలదని శ్రీ జయవర్ధనపుర విశ్వవిద్యాలయంలో ఇమ్యునాలజీ విభాగం అధిపతి నీలికా మలవిగే తెలిపారు.
అయితే రానున్న 2-3 వారాల తరువాతే నిజమైన పరిస్థితి బయటపడుతుందని అన్నారు. శ్రీలంక(Srilanka)లో కోవిడ్ నివారణ కోసం అక్కడి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. శ్రీలంకలో కూడా కరోనా సంక్రమణ వేగంగా విస్తరిస్తోంది. కొత్తగా గాలి ద్వారా వ్యాపించే కరోనా వైరస్‌ను శ్రీలంకలో గుర్తించడంతో ఆ ప్రభావం ఇండియాపై పడుతుందనే ఆందోళన ఎక్కువైంది. అదే జరిగింతే ఇప్పుడున్నదానికి తోడై..పరిస్థితి మరింత ప్రమాదకరం కానుంది.
Also read: Corona Second Wave: ఇండియాకు సహాయమందించేందుకు ముందుకొచ్చిన అగ్రరాజ్యం అమెరికా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook