SSC GD Constable Recruitment 2023: ఎస్ఎస్‌సి జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ అభ్యర్థులకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లో కానిస్టేబుల్ (GD), అస్సాం రైఫిల్స్‌లో SSF, అస్సాం రైఫిల్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో రైఫిల్స్ మ్యాన్ పోస్టులను పెంచుతున్నట్టు ఎస్ఎస్‌సి ప్రకటించింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక నోటీసు ప్రకారం పెంచిన SSC GD పోస్టుల సంఖ్య మొత్తం 50187 కి చేరుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎస్ఎస్‌సి జిడి కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ ఏడాది జనవరి 10 నుండి ఫిబ్రవరి 14 వరకు పరీక్షకు హాజరైన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే, తాజాగా పెంచిన ఖాళీల సంఖ్యను పరిశీలిస్తే.. కేటగిరీల వారీగా ఖాళీల సంఖ్య వివరాలు ఇలా ఉన్నాయి.


పురుషులు - నక్సల్ ప్రభావిత ప్రాంతాలు, బార్డింగ్ గార్డింగ్ డిస్ట్రిక్ట్స్/ప్రాంతాలు మినహాయించి పోస్టుల సంఖ్య 25946
పురుషులు - నక్సల్ ప్రభావిత జిల్లాలు - 7299
పురుషులు - బార్డింగ్ గార్డింగ్ డిస్ట్రిక్ట్స్ 11194
స్త్రీ -నక్సల్ ప్రభావిత జిల్లాలు, బార్డింగ్ గార్డింగ్ డిస్ట్రిక్ట్స్/ప్రాంతాలు మినహాయించి పోస్టుల సంఖ్య  3318
స్త్రీ - నక్సల్ ప్రభావిత జిల్లాలకు కేటాయించిన పోస్టుల సంఖ్య 895
స్త్రీ - బార్డింగ్ గార్డింగ్ డిస్ట్రిక్ట్స్ 1360


సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్, SSFలో కానిస్టేబుల్ (GD), అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (GD), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. అన్నీ కలిపి పోస్టుల సంఖ్య పెంచిన అనంతరం వివిధ బలగాల వారీగా SSC GD పోస్టుల సంఖ్య ఇలా ఉంది.
పోలీస్ ఫోర్స్ - ఖాళీల సంఖ్య
bsf    - 21052
CISF   - 6060
CRPF   - 11169
SSB    - 2274
ITBP   - 5642
AR     - 3601
SSF    - 214
NCB    - 175
మొత్తం          - 50187


ఇది కూడా చదవండి : Patna Obscene Video: కొంపముంచిన కక్కుర్తి.. పోర్న్ చూస్తూ రైల్వేస్టేషన్లో అందరికీ చూపించేశాడు!


ఇది కూడా చదవండి : SBI Credit Card: యూజర్లకి ఎస్బీఐ షాక్.. ఏకంగా ఆ చార్జీలు రెట్టింపు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK