SBI Credit Card Service Charges: తమ క్రెడిట్ కార్డు వినియోగదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకిచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు సర్వీస్ ఛార్జీలను రూ.99 నుంచి రూ.199 కి పెంచింది. ఇక ఈ 199 రూపాయలకు జీఎస్టీ, ఇతర పన్నులు అదనంగా ఉండనున్నాయి. ఈ నెల 17 నుంచి సవరించిన ధరలు అమలులోకి రాగా పెరిగిన ధరలకు ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ-మెయిల్ పంపడం చర్చనీయాంశం అయింది.
ఈ కొత్త ఛార్జీల గురించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు ఇమెయిల్ పంపడం ద్వారా తెలియజేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంపిన ఈ మెయిల్ ప్రకారం, ఇంతకు ముందు క్రెడిట్ కార్డ్ సర్వీసు ఛార్జీలు అంటే ఒకరకంగా అద్దె అనుకుందాం, అది చెల్లించడానికి రూ. 99 ప్రాసెసింగ్ ఫీజు ఉండేది. ఇప్పుడు అది రెట్టింపు అయింది. మార్చి 17, 2023 నుంచి, బ్యాంక్ దానిని రూ.199కి పెంచింది. ఇక అవే కాకుండా, జీఎస్టీతో పాటు పన్ను ప్రత్యేకంగా వసూలు చేయబడుతుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, నవంబర్ 15, 2022న, ఈ సర్వీసు ఛార్జ్ గా బ్యాంక్ 99 రూపాయలను ఛార్జీని విధించింది. ఇది కాకుండా, 18 శాతం జీఎస్టీ విడిగా వసూలు చేస్తున్నట్టు ప్రకటించింది. అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, నవంబర్ 15న మర్చంట్ ఈఎంఐ లావాదేవీల ఛార్జీలు కూడా రూ.99 నుంచి రూ.199కి పెంచారు.
ఇందులో కూడా జీఎస్టీని ప్రత్యేకంగా వసూలు చేస్తారు. ఇంతకు ముందు ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మరియు కోటక్ బ్యాంక్ కూడా పెరిగాయి. ఫిబ్రవరి 15, 2023 నుండి, కోటక్ బ్యాంక్ లావాదేవీల మొత్తం మీద GST ఛార్జీలో 1 శాతం వసూలు చేస్తోంది. అదే సమయంలో, బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా 1 శాతం లావాదేవీ రుసుమును వసూలు చేస్తోంది.
Also Read: Raviteja and Nani: 'రావణాసుర' 'ధరణి'తో కలిసి దసరా చేస్తే.. రచ్చ రచ్చే ఇక!
Also Read: Keerthy Suresh Gold Coins: బంగారు కీర్తి.. ఏకంగా 130 మందికి గోల్డ్ కాయిన్స్ పంపిణీ!