న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మరి (Covid-19) కారణంగా కేంద్రం ప్రకటించిన (Lockdown) లాక్ డౌన్ వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు వాయిదాపడ్డాయి. ఈ క్రమంలో పెండింగ్‌లో ఉన్న (CGL,CHSL) సీజిఎల్, సీహెచ్‌ఎస్‌ఎల్ ఇతర పరీక్షల తేదీలను (SSC) ఎస్‌ఎస్‌సీ విడుదల చేసింది. COVID-19 మహమ్మారి కారణంగా పరీక్షలు మార్చి నుండి జరగాల్సిన అన్నీ పరీక్షలు రద్దు చేయబడ్డాయి. అయితే ప్రస్తుతం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఆగస్టు-అక్టోబర్‌లో పరీక్షను నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: COVID-19 tests: ఉస్మానియా మెడికల్ కాలేజీ స్టూడెంట్స్‌కి కరోనా


పెండింగ్‌లో ఉన్న పరీక్షలను (Re schedule) రీ షెడ్యూల్ చేయాలనే ఉద్దేశ్యంతో కరోనా వైరస్ మహమ్మారి నుండి ఉత్పన్నమయ్యే పరిస్థితిని (Staff Selection Commission) స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సోమవారం నాడు  సమీక్షించింది. మొత్తం పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, పరీక్షల తేదీలను ప్రకటించాలని నిర్ణయించినట్లు (SSC) ఎస్‌ఎస్‌సీ తెలిపింది. 


Also Read: ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు


ఎస్‌ఎస్‌సీ, సీహెచ్‌ఎస్‌ఎల్ (SSC, CHSL) 2019 (Tier-1) ఆగస్టు 17-21, మరల 24-27 వరకు నిర్వహించబడుతుందని, ఎస్‌ఎస్‌సీ, సీజిఎల్ 2019 టైర్ 2 పరీక్ష అక్టోబర్ 14 నుండి అక్టోబర్ 17 వరకు జరుగుతాయని పేర్కొంది. మరోవైపు ఎస్‌ఎస్‌సీలో ఉన్న వివిధ గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం ఎంపిక పరీక్షలను సెప్టెంబర్ 7 నుండి సెప్టెంబర్ 9 వరకు జరుగుతాయని కమిషన్ పేర్కొంది. అదే రకంగా జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్) పరీక్ష (పేపర్ -1), 2019 సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 4 వరకు జరుగనున్నట్లు తెలిపింది. 


Also Read: Tamilnadu: తెరుచుకోనున్న సెలూన్లు.. ఆ కార్డు తప్పనిసరి.


స్టెనోగ్రాఫర్(Stenographer) Grade 'c', 'D' పరీక్ష 2019 సెప్టెంబర్ 10-12 తేదీలలో జరుగుతాయని, ఢిల్లీ పోలీసు(Delhi Police), సిఎపిఎఫ్ Central Police Forece (CPF) పరీక్ష (పేపర్ -1) -2020 లోని సబ్ ఇన్స్పెక్టర్లు సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 5 వరకు ఉంటాయని, జూనియర్ హిందీ translatar, సీనియర్ హిందీ translatar హిందీ ప్రధాన పరీక్ష (Paper I)-2020 అక్టోబర్ 6న ఉంటుందని ఓ ప్రకటన విడుదల చేసింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..