హైదరాబాద్: కరోనా దెబ్బకు మార్కెట్ అంతా కుదేలయిపోయింది. చిన్న తరహా షాపింగ్ సముదాయాల నుండి మల్టిఫ్లెక్స్ ల వరకు మూతపడిపోయాయి. లాక్ డౌన్ నాల్గో దశ వరకు కఠినంగా అమలు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ (Lockdown 5.0) లో కాస్త సడలింపులనిస్తోంది. పరిమితమైన సంఖ్యల్లో సామాజిక దూరం పాటిస్తూ కార్యకలాపాలు జరుపుకోవాలని సూచిస్తోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు కొన్ని కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం సెలూన్లు, బ్యూటీ పార్లర్లూ, స్పా లకు అనుమతినిచ్చింది. సెలూన్లు, బ్యూటీ పార్లర్లూ, స్పా లలో తప్పనిసరిగా ఓ రిజిస్టర్ ఉంచుకోవాలని, అందులో వినియోగదారుల వివరాల నమోదుతో పాటు ఆధార్ నంబర్ తప్పనిసరని పేర్కొంది.
Also Read: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా
అంతేకాకుండా సామాజిక దూరం తప్పనిసరంటూ సీట్లలో 50 శాతం మాత్రమే ఉండాలని, మధ్యలో ఖాళీ ఉంచాలని సూచించింది. ఒకరికి వాడిన బ్లేడ్ మరోరికి వాడకూడదని పేర్కొంది. కాగా సెలూన్ లో ఏ పరికరాలు వాడినా వాటిని ముందుగా శానిటైజర్‌తో శుభ్రం చేసిన తర్వాతే వాడాలని, లోపలికి గాలి వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలని సెలూన్ లోని వస్తువులను లైజోల్, హైపోక్లోరైట్ కలిపిన మిశ్రమంతో రోజుకు ఐదుసార్లు శానిటైజ్ చెయ్యాలని మార్గదర్శకాలను విడుదల చేసింది. చేతులకు శానిటైజర్ రాసుకోవాలని మాస్క్, గ్లోవ్స్ ధరించాలని పేర్కొంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి