SBI PO JOBS Notification 2021: నిరుద్యోగులకు శుభవార్త. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమౌతున్న అభ్యర్ధులకు ఉత్సాహాన్నిచ్చే వార్త. దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఆఫీసర్ ఉద్యోగాల్ని భర్తీ చేయనుంది. ఆ వివరాలు పరిశీలిద్దాం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank of India)నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ అందిస్తోంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమౌతున్న అభ్యర్ధులకు నిజంగా ఓ అద్భుత అవకాశం. ఎందుకంటే ఎస్బీఐ భారీగా ప్రొబెషనరీ ఆఫీసర్ ఉద్యోగాల్ని భర్తీ చేయబోతోంది. పోస్టుల భర్తీకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టులు ఏకంగా 2056 ఉన్నాయి. ఇందులో రెగ్యులర్ 2 వేల పోస్టులు కాగా బ్యాక్‌లాగ్ పోస్టులు 60 ఉన్నాయి. ఈ పోస్టులకు అర్హత ఏంటి, ఎలా దరఖాస్తు చేయాలి, పరీక్ష ఎప్పుడుంటుందనే వివరాల్ని ఎస్బీఐ (SBI PO JOBS Recruitment)ప్రకటించింది.


గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణ లేదా సమానమైన విద్యార్ఙత కలిగి ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


2021 ఏప్రిల్ 1 నాటికి 21-30 ఏళ్ల మధ్య వయస్సుండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయస్సు సడలింపు ఉంటుంది. 


ఎంపిక మూడంచెల విధానంలో ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్, ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధుల ఎంపిక జరుగుతుంది.


ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
అక్టోబర్ 5, 2021 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానం
అక్టోబర్ 25, 2021 ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ
ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఉంటుంది.
https://bank.sbi/web/careers


Also read: Blood Thinner Medicines: కోవిడ్ మరణాల్ని తగ్గించడంలో బ్లడ్ థిన్నర్ మెడిసిన్స్ పాత్ర కీలకం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook