సుబ్రమణ్యస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందుత్వమే బీజేపీకి బలమని..  అభివృద్ధి నినాదం  కన్నా..హిందుత్వమే నినాదమే ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తుందని స్వామి అభిప్రాయపడ్డారు. గతంలో ' భారత్ వెలిగిపోతోంది' నినాదంతో ఎన్నికల బరిలోకి దిగి  బీజేపీ ఓటమి పాలైందని..2014 ఎన్నికల్లో హిందుత్వ నినాదం పార్టీని గెలిపించిందన్న విషయాన్ని గుర్తు చేస్తూ స్వామి తన వాదనను సమర్ధించుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జమ్ముకశ్మీర్ లో హిందూ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయాలని ఈ సందర్భంగా సుబ్రమణ్యస్వామి డిమాండ్ చేశారు. హిందు వ్యక్తిని సీఎం చేసేందుకు పీడీపీ ఒప్పుకుంటే ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలని బీజేపీకి సుబ్రమణ్య స్వామి సలహా ఇచ్చారు. 


[[{"fid":"171245","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


జమ్మూలో పీడీపీ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీడీపీ, కాంగ్రెస్ జతకట్టేందుకు యత్నిస్తున్నాయి. దీంతో సుబ్రమణ్యస్వామి హిందు వ్యక్తి ముఖ్యమంత్రి అనే అంశాన్ని తెరపైకి తెచ్చి పీడీపీలో చీలిక తీసుకోచ్చే వ్యూహాంతో ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకలు అభిప్రాయపడుతున్నారు.