ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జవాన్లపై మావోయిస్టులు మెరుపుదాడికి దిగారు. మావోయిస్టుల స్థావరంగా ఉన్న సుక్మా జిల్లాలో ఐఈడీ పేలుడులో 8 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. నక్సల్స్ జరిపిన ఈ పేలుడులో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు అని మొదట నివేదికలు అందాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సంఘటన సుక్మాలోని గొల్లపల్లి, కిష్టాపురం సమీపంలో ప్రాంతంలో జరిగింది. మరణించిన సీఆర్పీఎఫ్ సిబ్బంది 212 బెటాలియన్ కి చెందిన వారు. గాయపడిన జవాన్లు అక్కడి నుంచి తరలించారు. చికిత్స కోసం వారిని రాయ్ పూర్ కి తీసుకెళ్లారు.


సీఆర్పీఎఫ్ జవాన్లకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగిందని జీ న్యూస్ ఉదయమే నివేదించింది. ఆతరువాత వారు అక్కడి నుండి తప్పించుకోగలిగారు. కానీ, తరువాత వారు జవాన్లు ప్రయాణిస్తున్న యాంటి-మైన్ వాహనాన్ని పేల్చివేశారు. ఇందుకోసం నక్సల్స్  భారీగా పేలుడు పదార్థాలను ఉపయోగించారు.


"కిష్టాపురం, పలోడి మధ్య పెట్రోలింగ్ యాంటి-మైన్ వాహనంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు ఐఈడీ మందుపాతరలను ఉపయోగించి పేల్చారు. అదనపు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఎటువంటి కాల్పులు జరగటం లేదు '' అని యాంటీ నక్సల్ ఆపరేషన్స్  స్పెషల్ డిజీ డిఎం అవస్తి తెలిపారు.