Tirumala Tirupati Devasthanam: తిరుమల వేంకటేశుని దర్శనం కోసం దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు స్వామివారిని తనివితీరా దర్శించేందుకు తిరుమల చేరుకుంటారు. అయితే నిన్న శనివారం సెలవు దినం కావడంతో ఎంత మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు తెలుసుకుందాం. అక్కడి రద్దీ పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం.
కలియుగ దైవం వేంకటేశుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న శ్రీహరి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ తిరుమల దేవస్థానం ప్రతిరోజు కొన్ని వేల మంది స్వామివారిని దర్శించుకుంటారు.
అయితే నిన్న శనివారం వీకెండ్ కావడంతో స్వామివారిని 73,500 మంది దర్శించుకున్నారు. 9వ తేదీ శనివారం మరుసటి రోజు ఆదివారం రావడంతో ఈ సంఖ్య కాస్త పెరిగింది. మొన్నటి వరకు పండుగల సందర్భంగా సాధారణ రద్దీ కనిపించింది.
తిరుమల స్వామివారి దర్శనం చేసుకోవడానికి రూ.300 ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులతోపాటు, సర్వదర్శనానికి ఎదురు చూసిన కొన్ని వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఏ ఇబ్బందులు కాకుండా టీటీడీ యంత్రాంగం భోజనం, నీటి సదుపాయాలను కూడా వారికి కల్పించారు.
అయితే నిన్న శనివారం సందర్భంగా శ్రీవారికి హుండీ ఆదాయం 3.79 కోట్లు వచ్చింది. ఇక మొత్తంగా 32,600 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారని తిరుమల అధికారిక యంత్రాంగం తెలిపింది. తిరుమల శ్రీవారి దర్శనానికి నిన్న సర్వ దర్శనానికి ఎదురు చూసిన భక్తులకు 8 గంటల సమయం పట్టింది. 25 కంపార్ట్‌మెంట్లలో కిటకిటలాడాయి.
ఇక టైమ్ స్లాట్ భక్తులతో మొత్తంగా పది కంపార్ట్మెంట్లో స్వామి వారి దర్శనార్ధం ఎదురు చూడగా, వీళ్లకి స్వామి వారినికి దర్శించుకోవడానికి 4 గంటల సమయం పట్టింది. తిరుమల శ్రీవారిని దర్శనం కలుగాలని ఎంతో మంది భక్తులు ఎదురు చూస్తారు. ప్రతిరోజూ స్వామివారికి రకరకాల సేవలు అందిస్తారు. స్వామి వారి ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఆ సమయంలో కనుల పండువగా కనిపిస్తుంది.