Gongura Health Benefits: ముఖ్యంగా గోంగూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఏ, విటమిన్ సి విటమిన్ కె ఉంటుంది. అంతేకాదు ఇందులో విటమిన్ బి కూడా ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచివి. గోంగూరలో మెగ్నీషియం కాల్షియం కూడా ఉంటుంది ఇవి ఎముక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఫైబర్ కడుపు నిండిన అనుభూతి ఎక్కువసేపు కనిపిస్తుంది. దీంతో బరువు పెరగకుండా ఉంటారు త్వరగా ఆకలి కూడా వేయదు. గోంగూరలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సిడెంట్ టు డేమేజ్ కాకుండా కాపాడుతుంది ఇందులో ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. కాబట్టి మోకాళ్ళ, కీళ్ల నొప్పుల నుంచి త్వరగా బయట పడేస్తుంది. ఈ నేపథ్యంలో గోంగూర మీ డైట్‌లో ఉండాల్సిందే.
బ్లడ్ ప్రెషర్ సమస్యలతో బాధపడేవారు గోంగూరను డైట్ లో చేర్చుకోవాలి. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇవి రక్తపోటు సమస్యను నివారిస్తుంది. హైపర్ టెన్షన్ రాకుండా కాపాడుతుంది. గోంగూరలో ఉండే విటమిన్ సి వల్ల యూనిటీ స్థాయిలను పెంచుతాయి. దీంతో సీజనల్ వల్ల వచ్చే జబ్బులు రాకుండా నివారిస్తుంది.
పోషకాలకు పవర్ హౌస్ అయినా గోంగూరను మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి పొందవచ్చు.
మన పూర్వీకులు కాలం నుంచి గోంగూరతో అనేక రెసిపీలు తయారు చేస్తారు. వివిధ రకాల మసాలాలు వేసి చట్నీ తయారు చేసుకోవచ్చు. పప్పు కూడా తయారు చేసుకోవచ్చు వేడి వేడి పప్పు అద్భుతంగా ఉంటుంది లేకపోతే రైస్ లో వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.వెయిట్ లాస్ జర్నీ లో ఉన్నవాళ్లు గోంగూరను డైట్ లో చేసుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువగా ఉంటుంది. ఇందులోని ఫైబర్ వల్ల కడుపు సమస్యలకు చెక్ పెడుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంచడమే కాకుండా ఇది డయాబెటిస్ రోగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. వారికి ఇది ఎంతో ఆరోగ్యం అవసరం బరువు పెరగకుండా నివారిస్తుంది ఎక్కువ సమయం పాటు ఆకలి వేసిన అనుభూతి కలిగించదు.
ఇదీ చదవండి: నల్లటి ఎండుద్రాక్షల్లో నమ్మలేని 5 ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఈరోజు డైట్‌లో చేర్చుకుంటారు..
గోంగూరను డైట్ లో చేర్చుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇది ఆకుకూర కాబట్టి హెయిర్ ఫాల్ ఉందా కాపాడుతుంది. సరైన పోషకాలు మన శరీరానికి జుట్టుకి అందుతాయి. ఇందులోని ఐరన్ కంటెంట్ వల్ల ఎనిమియా సమస్యకు చెక్ పెట్టవచ్చు రక్తాన్ని నిలుపుతుంది. ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఆడవారి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ప్రతి వారంలో కనీసం రెండు సార్లు అయినా గోంగూరను డైట్ లో చేర్చుకోవాలి. పుల్లని రుచి కలిగిన గోంగూరను పప్పు రూపంలో తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది గోంగూర చట్నీ కూడా అదిరిపోతుంది.
ఇదీ చదవండి: ఆముదం బట్టతలపై కూడా జుట్టుమొలిపించే అద్భుత వరం.. చర్మానికి కూడా బోలెడు లాభాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.