Judges Security: న్యాయమూర్తుల భద్రతకు ప్రమాదం ఏర్పడింది. జార్ఖండ్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జార్ఖండ్ న్యాయమూర్తి ఉత్తమ్ ఆనంద్ హత్యోదంతం తరువాత న్యాయమూర్తుల భద్రత ప్రశ్నార్ధకమైంది. ఈ విషయంపై చాలారోజుల వరకూ చర్చ జరిగింది. ఇప్పుడీ వ్యవహారంపై సుప్రీంకోర్టు..కేంద్ర ప్రభుత్వానికి(Central government) కొన్ని సూచనలు చేసింది. న్యాయమూర్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరింది. న్యాయమూర్తుల భద్రతను రాష్ట్రాలకు వదిలేయకుండా కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని సూచించింది. జడ్జిల భద్రతపై తీసుకోవల్సిన చర్యలపై నివేదిక దాఖలు చేయనందుకు జార్ఖండ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం చెందింది.


రాష్ట్ర ప్రభుత్వం జడ్జిల భద్రతకు(Judges Safety) చర్యలు తీసుకున్నా సరే పదే పదే దాడులు జరుగుతున్నాయని తెలిపింది. సీసీటీవీలనేవి నేరాలు, బెదిరింపులు జరగకుండా నిరోధించలేవని సుప్రీంకోర్టు(Supreme Court) వెల్లడించింది. వారం రోజుల్లోగా న్యాయమూర్తుల భద్రతకు సంబంధించిన నివేదికను సమర్పించాలని ఆదేశించింది. లేకుంటే లక్ష రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. 


Also read: PM SYM: రూ.55 పెట్టుబడితో ప్రతినెల రూ. 3 వేలు పొందే అద్భుత పథకం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook