Supreme Court clears to central vista project | న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆధునిక సౌకర్యాలతో నిర్మించ తలపెట్టిన (Parliament Building) సెంట్రల్ విస్టా రీడవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టు డిజైన్‌పై కేంద్రం వాదనలతో ధర్మాసనం ఏకీభవిస్తూ మంగళవారం తీర్పును వెలువరించింది. అయితే నిర్మాణ పనులకు ముందే హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డీడీఏ చట్టం కింద చేపట్టిన ఈ (Central Vista) ప్రాజెక్టు చట్టబద్ధమేనని, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన అనుమతులు, స్థలం కేటాయింపులు కూడా సరిగ్గానే ఉన్నాయని న్యాయస్థానం (Supreme Court) వెల్లడించింది. అయితే ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించే స్మాగ్‌ టవర్లను ఏర్పాటు చేయాలని, యాంటీ-స్మాగ్‌ గన్నులను ఉపయోగించాలని న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది. Also read: Narendra Modi: కొత్త పార్లమెంట్ భవనానికి ప్రధాని శంకుస్థాపన


సెంట్రల్ విస్టా ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలు కాగా.. వాటిని విచారించిన త్రిసభ్య ధర్మాసనం ఈ విధంగా తీర్పునిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే కేంద్రం (Central government) వాదనలతో జస్టిస్‌ ఖాన్విల్కర్‌, జస్టిస్‌ మహేశ్వరీ ఏకీభవించగా.. జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా వ్యతిరేకించారు. దీంతో 2-1 మెజార్టీతో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.


అయితే సుప్రీంలో విచారణ పెండింగ్‌లో ఉండగానే సెంట్రల్‌ విస్టా శంకుస్థాపనకు న్యాయస్థానం అనుమతించింది. అయితే ఇప్పుడే ఎలాంటి నిర్మాణాలను ప్రారంభించవద్దని కేంద్రానికి స్పష్టం చేసింది. దీంతో గతేడాది డిసెంబరు 10న ప్రధానమంత్రి నరేంద్రమోదీ నూతన పార్లమెంట్ భవనానికి (New Parliament Building) శంకుస్థాపన చేశారు.
Read: Kumbh Mela 2021: జనవరి 14న కుంభమేళా ప్రారంభం.. గంగానదీ స్నానాల ప్రాముఖ్యత తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook