Supreme Court dismisses plea: న్యూఢిల్లీ: పీఎం కేర్స్‌ ఫండ్‌ను ఎన్డీఆర్ఎఫ్‌కు బ‌దిలీ చేయాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పీఎం కేర్స్‌ ఫండ్‌ ( PM CARES Fund ) కు నిధులు విరాళాల రూపంలో వ‌చ్చాయని.. వాటిని మళ్లించడం కుదరదని పేర్కొంటూ సర్వోన్నత ధర్మాసనం (Supreme Court) ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. పీఎం కేర్స్ ఫండ్ నిధులను ఎన్డీఆర్‌ఎఫ్‌కు బదిలీ చేయాలని సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ ( CPIL ) అనే ఎన్జీఓ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జూన్ 17న తన స్పందనను దాఖలు చేయాలని సుప్రీం కేంద్ర ప్రభుత్వానికి ( Central government ) సూచించింది. అనంతరం ఈ పిటిషన్‌ను మంగళవారం విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం కరోనావైరస్ ( Coronavirus ) కోసం తాజా జాతీయ విపత్తు ప్రణాళిక అవసరం లేదని ఈ తీర్పును ప్రకటించింది.  Also read: Vande Bharat Mission: ఎయిరిండియా విమానాలపై నిషేధం


పీఎం కేర్స్ ఫండ్ అనేది ప‌బ్లిక్ చారిటీ ట్ర‌స్టు లాంటిద‌ని కేంద్రం కోర్టులో పేర్కొంది. ఎవ‌రైనా దానికి స్వ‌చ్ఛందంగా విరాళం ఇవ్వ‌వ‌చ్చు అని వివరించింది. అయితే.. కొత్త ఫండ్‌ను క్రియేట్ చేయ‌డం వ‌ల్ల అది ఎన్డీఆర్ఎఫ్‌కు అడ్డుగా మారిన‌ట్లు పిటిష‌న్ వాదించారు. దీంతోపాటు పీఎం కేర్స్ ఆడిట్ గురించి కూడా పిటిషనర్ తరపు న్యాయవాది ప్ర‌శ్నించారు. అయితే ఈ పిటిష‌న్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు.. కొత్త డిజాస్ట‌ర్ రిలీఫ్ ప్లాన్ అవ‌స‌రం లేద‌ని స్పష్టంచేసింది. ఇదిలాఉంటే.. కోవిడ్ 19 ప్రారంభం నాటినుంచి పీఎం కేర్స్ ఫండ్‌‌కు భారీ ఎత్తున నిధులు విరాళంగా వచ్చాయి.  Also read: Kiran Mazumdar Shaw: కరోనా బారిన బయోకాన్ చీఫ్