Supreme Court: పతంజలి ప్రకటనలపై నిషేధం, కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ, కేంద్రంపై ఆగ్రహం
Supreme Court: పతంజలి సంస్థ వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెట్టింది. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా కేంద్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అసలేం జరిగిందంటే..
Supreme Court: ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలిపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ సంస్థ ప్రకటనలపై నిషేధం విధించింది. అంతేకాకుండా ఇన్నాళ్లూ కళ్లు మూసుకుని కూర్చుందంటూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడింది. ఈ కేసు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సుప్రీం వ్యాఖ్యలతో పతంజలి సంస్థ నిర్వాకం మరోసారి బయటపడింది.
పతంజలి సంస్థ ఇచ్చిన కొన్ని ప్రకటనల్లో తమ సంస్థ మందులు వాడితే డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్, ఆస్తమా, ఆర్థరైటిస్, గ్లూకోమా వంటి వ్యాధుల్ని శాశ్వతంగా నయం చేయవచ్చని చెబుతూ ప్రముఖ మీడియా సంస్థల్లో ప్రకటనలిచ్చింది. ఈ ప్రకటనలు ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే కాకుండా తప్పుడు సందేశాల్ని ఇస్తున్నాయని పేర్కొంటూ గత ఏడాది నవంబర్ నెలలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గత విచారణలోనే పతంజలి సంస్థపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆధునిక అల్లోపతి వైద్య విధానం, వైద్యుల్ని కించపరుస్తూ, నిరాధార ప్రకటనలు చేస్తున్న పతంజలి సంస్థపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇలాంటి మోసపూరిత ప్రకటనలు చేస్తే ఒక్కో ప్రకటనపై కోటి రూపాయలు జరిమానా విధిస్తామని సైతం హెచ్చరించింది. పతంజలి సంస్థ యజమాని బాబా రాందేవ్‌కు సుప్రీంకోర్టు తీవ్రంగానే హెచ్చరించింది.
అయినా ఆ ప్రకటనలు ఆగలేదు సరికదా పతంజలి సంస్థపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం చెందింది. కేంద్ర ప్రభుత్వం కళ్లు మూసుకుని కూర్చుందని తీవ్రంగా వ్యాఖ్యానించింది. తప్పుడు ప్రకటనలతో దేశాన్ని, దేశ ప్రజల్ని వక్రమార్గంలో తీసుకెళ్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పతంజలి ప్రకటనలపై పూర్తిగా నిషేధం విధించింది. తక్షణం కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా ఆదేశించింది.
పతంజలి సంస్థ గురువు బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణలకు సుప్రీంకోర్టు ఆదేశాల్ని ఉల్లంఘించిన నేరానికి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ హమా కోహ్లి ఈ ఆదేశాలు జారీ చేశారు.
Also read: Railway Recruitment 2024: రైల్వేలో మెగా రిక్రూట్‌మెంట్, ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook