Supreme Court: కరోనా వ్యాక్సినేషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Supreme Court: దేశంలో కరోనా మహమ్మారి ఫోర్త్‌వేవ్ రూపంలో దూసుకొస్తుందనే హెచ్చరికల నేపధ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యాక్సినేషన్ విషయమై కోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Supreme Court: దేశంలో కరోనా మహమ్మారి ఫోర్త్‌వేవ్ రూపంలో దూసుకొస్తుందనే హెచ్చరికల నేపధ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యాక్సినేషన్ విషయమై కోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
కరోనా మహమ్మారి ఫోర్త్‌వేవ్ ఆందోళన అధికమైంది. ఇప్పటికే రోజురోజుకూ కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జూన్ చివరి వారం నాటికి దేశంలో కరోనా ఫోర్త్‌వేవ్ ప్రారంభమై...సెప్టెంబర్ వరకూ ఉంటుందనే హెచ్చరికలున్నాయి. ఈ నేపధ్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో సుప్రింకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి..
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయడంపై సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో ప్రజలను ఒత్తిడి చేయవద్దని సుప్రీంకోర్టు స్ప,ష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి కేంద్ర ప్రభుత్వం డేటా విడుదల చేయాలని కోరింది. కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకోకపోతే బహిరంగ ప్రదేశాల్లో నో ఎంట్రీ అనడం సమంజం కాదని కోర్టు తెలిపింది. ఈ విషయమై కొన్ని రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాన్ని, ఆంక్షల్ని ఎత్తివేయాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది. వ్యాక్సినేషన్ విషయంలో ప్రజా సంక్షేమానికై ప్రభుత్వమే ఓ విధానం రూపొందించాలని తెలిపింది.
మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ 1 189 కోట్ల 23 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ అందింది.
Also read: Shawarma Food Poison: ప్రాణం తీసిన 'షవర్మా'.. టీనేజ్ యువతి మృతి... ఆసుపత్రిపాలైన 31 మంది...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook