రాజస్థాన్ ( Rajasthan CM ) ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ( Ashok Gehlot ) కు సర్వోన్నత న్యాయస్థానం నుంచి షాక్ ఎదురైంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల పిటీషన్ పై ఉత్తర్వులు జారీ చేయకుండా హైకోర్టును నిలువరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంతీర్పుతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వర్గం నిరాశకు లోనైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


రాజస్థాన్ లో సంక్షోభానికి ఇప్పట్లో తెరపడేలా కన్పించడం లేదు. తిరుగుబాటు నేత ( Rebel Leader ) మాజీ డిప్యూటీ సీఎం సచిన్ ( Ex Deputy cm Sachin Pilot ) పైలట్ సహా 19 మంది ఎమ్మెల్యేలకు రాజస్థాన్ స్పీకర్ ( Rajasthan Speaker CP Joshi ) నోటీసులు పంపించారు. దీన్ని సవాలు చేస్తూ సచిన్ పైలట్ ( Sachin pIlot ) వర్గం కోర్టుకు వెళ్లడంతో కోర్టులో ఊరట లభించింది. 24వ తేదీ వరకూ అనర్హత వేటు వేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే దీన్ని సవాలు చేస్తూ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ( CM Ashok Gehlot ) వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అసంతృప్తి ఎమ్మెల్యేల పిటీషన్లపై ఉత్తర్వులు జారీ చేయకుండా రాజస్తాన్ హైకోర్టును నిలువరించాలని కోరారు. అయితే అలా చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.  మరోవైపు విచారణను హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు బదలాయించాలని రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి ( Assembly Speaker CP Joshi ) దాఖలు చేసిన పిటీషన్ పై విచారణను కూడా కోర్టు వాయిదా వేసింది. ప్రజాస్వామ్యంలో స్వరాల్ని అణిచివేయలేమని కోర్టు తెలిపింది. పైలట్ సహా తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత నోటీసులకు కారణాలు చెప్పాలని సుప్రీంకోర్టు స్పీకర్ ను కోరింది. Also read: Ram Temple: రామమందిర ముహూర్తం అశుభం: శంకరాచార్య


అసంతృప్తి ఎమ్మెల్యేలు పార్టీ సమావేశాలకు హాజరుకాకుండా..ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు కుట్ర పన్నారని స్పీకర్ తరపు న్యాయవాది వివరణ ఇచ్చారు. అయితే ఇది మామూలు విషయం కాదని...వారు ఎన్నికైన ప్రజా ప్రతినిధులని జస్టిస్ మిశ్రా అభిప్రాయపడ్డారు. Also read: కార్గో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభించనున్న సౌత్ సెంట్రల్ రైల్వే