లక్షల కోట్ల విలువైన నిధి బయటపడటంతో పద్మనాభస్వామి ఆలయం ( Padmanabhaswamy temple ) ఒక్కసారిగా వార్తలకెక్కింది. అంతకంటే విలువైన నేలమాళిగ గదిని తెరవాలన్న వివాదంపై సుప్రీంకోర్టు ( Supreme court ) ‌తీర్పునిచ్చింది. విలువైన గది తెరిచే నిర్ణయాన్ని వారికే అప్పగించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2011లో కేరళ తిరువనంతపురంలో ( Tiruvanantapuram ) ఉన్న పద్మనాభస్వామి ఆలయంలో లక్షల కోట్ల విలువైన నిధి బయటపడింది. ఆలయంలోని రహస్య తలుపుల్ని తెరిచినప్పుడు ఈ  విషయం వెలుగుచూసింది. ఈ పరిణామంతో దేశంలోనే అత్యంత విలువైన గుడిగా మారిపోయింది. ఒక్క నేల మాళిగను మాత్రం తెరవకుండా ఉంచేశారు. అప్పట్నించి ఆ గదిని కూడా తెరవాలనే విషయంపై వాదన సాగుతోంది. తెరవాలని కొందరు, తెరవకూడదని మరి కొందరు వాదించుకున్నారు. నాగబంధముందని..తెరిస్తే ప్రళయం వస్తుందనేది ఇంకొందరి వాదన. Also read: Sachin Pilot: ఎవరీ సచిన్ పైలట్? ఎందుకీ వివాదం?


ఇంతకీ తలుపులు తెరవాలనే విషయంపై నిర్ణయం తీసుకునేది ఎవరనేది అసలు ప్రశ్నగా మిగిలింది. 1991లో ఈ ఆలయ సంస్థానాదీశులైన ట్రావెన్‌కోర్ ( Travancore ) చివరి పాలకుడు మరణించిన కారణంగా రాజ కుటుంబ హక్కులు నిలిచిపోతాయనేది 2011లో కేరళ హైకోర్టు ( Kerala Highcourt ) ఇచ్చిన తీర్పు సారాంశం. ఆలయ నిర్వహణ కోసం ఓ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. దాంతోపాటు మిగిలిన ఆరవ నేలమాళిగ గదిని కూడా తెరవాలని ఆదేశించింది. కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై విబేధించిన ట్రావెన్‌కోర్ వంశీయులు హక్కులు తమకే చెందుతాయంటూ సుప్రీంను ఆశ్రయించారు. అప్పట్నించీ పెండింగ్ లో ఉన్న ఈ కేసుకు 9 ఏళ్ల అనంతరం తెర దిగింది. కేరళ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టి పారేసింది. చివరి పాలకుడి మరణంతో హక్కులు రద్దు కావని స్పష్టం చేసింది. ఆలయ నిర్వహణ సైతం ఆ కుటుంబానిదేని  చెప్పింది. దాంతో  కీలకమైన ఆరవ నేలమాళిగ గదిని తెరిచే విషయంపై ట్రావెన్‌కోర్ కుటుంబమే ( Travancore royal family ) నిర్ణయం తీసుకోనుంది ఇకపై. Also read: Job News 2020: ఎమ్ఎమ్ఆర్డీఏలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్