Chandigarh Mayor: సుప్రీంకోర్టులో అధికార బీజేపీకు చుక్కెదురైంది. చండీగఢ్ మేయర్ ఎన్నిక చెల్లదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రిటర్నింగ్ అధికారి చట్ట విరుద్ధంగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం ఆప్ అభ్యర్ధి కుల్దీప్ కుమార్‌ను చండీగఢ్ మేయర్‌గా ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనవర్ 30న చండీగడ్ మేయర్ ఎన్నిక జరిగింది. ఈ ఎఎ్నకల్లో ఆప్ అభ్యర్ధి కుల్దీప్ కుమార్‌పై బీజేపీ అభ్యర్ధి మనోజ్ సోంకర్ గెలుపొంది మేయర్‌గా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్ధికి 16 ఓట్లు రాగా, ఆప్-కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్ధి కుల్దీప్ కుమార్‌కు 12 ఓట్లు వచ్చాయి. అదే సమయంలో కుల్దీప్ కుమార్‌కు వచ్చిన 8 ఓట్లు చెల్లవని రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన అనిల్ మసీహ్ ప్రకటించారు. సరిగ్గా ఈ సమయంలో రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాల్ని తారుమారు చేసిన వీడియో వెలుగు చూసింది. ఇందులో బ్యాలెట్ పేపర్లను మార్కింగ్ చేస్తూ రిటర్నింగ్ అధికారి అడ్జంగా దొరికిపోయారు. దీంతో ఆప్ అభ్యర్ధి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 


ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం రిటర్నింగ్ అధికారి వైఖరిపై మండిపడింది. రిటర్నింగ్ అధికారి ఉద్దేశ్యపూర్వకంగానే బ్యాలెట్ పేపర్లు  కొట్టివేశారని స్పష్టం చేసింది. చెల్లుబాటు కాదని పక్కనపెట్టిన వాటిని సైతం లెక్కించాల్సిందేనని తెలిపింది. ఆ ఓట్లను కూడా పరిగణలో తీసుకుని లెక్కించి మేయర్ అభ్యర్ధి ప్రకటించాలని కోరింది. ఆ ఓట్లన్నీ ఆప్ అభ్యర్ధికి అనుకూలంగా ఉన్నట్టు తేలడంతో కుల్దీప్ కుమార్ సింగ్‌ను చండీగడ్ మేయర్‌గా సుప్రీంకోర్టు ప్రకటించింది. 


రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్‌పై విచారణకు కోర్టు ఆదేశించింది. ఓట్లను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని స్పష్టమైందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ తీర్పుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యాన్ని కాపాడిందన్నారు. 


Also read: Oneplus Nord N20 SE Price: అమెజాన్‌లో ఒక్కసారిగా తగ్గిన Nord N20 SE మొబైల్‌ ధర..డిస్కౌంట్ పూర్తి వివరాలు ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook