Corona second wave: ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమని..తక్షణం చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరిస్తోంది. దేశవ్యాప్తంగా  పది రాష్ట్రాల్నించే ఎక్కువ కేసులు వస్తున్నాయని స్పష్టం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఇప్పుడు ఎక్కడ చూసినా..ఎక్కడ విన్నా కరోనా సెకండ్ వేవ్ ప్రకటనే. అదే భయం వెంటాడుతోంది. యూరప్ దేశాల్లో గడగడలాడిస్తోంది  కరోనా సెకండ్ వేవ్. ఇండియాను కూడా కరోనా సెకండ్ వేవ్ ( corona second wave ) భయపెడుతోంది. దేశ రాజధాని ఢిల్లీ ( Delhi )లో అయితే కరోనా మూడవ దశలో ప్రవేశించిందని సాక్షాత్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Delhi Cm Arvind kejriwal ) ప్రకటించిన పరిస్థితి ఉంది. కరోనా సెకండ్ వేవ్ అనేది చాలా ప్రమాదకరమని..వెంటనే చర్యలు తీసుకోవల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు హెచ్చరించింది.


కోవిడ్ 19 వ్యాక్సిన్ ( Covid 19 vaccine ) వచ్చేంతవరకూ పూర్తిగా జాగ్రత్తలు పాటించాలని..కోవిడ్ మార్గదర్శకాల్ని అమలయ్యేలా చేసే బాధ్యత కేంద్రానిదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ఎస్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షా ల ధర్మాసనం సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉండనుందని హెచ్చరించింది. ఈ సందర్భంగా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. దేశ ప్రజల్లో 60 శాతం మంది మాస్క్ లు పెట్టుకోవడం లేదని పేర్కొంది. ఆంక్షల్ని కఠినతరం చేయాలని సూచించింది. 


దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా వైరస్  ( Corona virus ) కేసుల్లో 77 శాతం కేసులు పది రాష్ట్రాల్నించే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. దేశవ్యాప్తంగా  మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, కర్ణాటక, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్నించే ఎక్కువ కేసులు వస్తున్నట్టు అఫిడవిట్ దాఖలైంది. ఢిల్లీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే కేసులు పెరిగిపోయాయని అఫిడవిట్ లో కేంద్రం తెలిపింది.  Also read: Balram Bhargava: కోవిడ్ వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు ధ‌రించాల్సిందే