సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ మృతి కేసును సీబీఐకి (CBI) అప్పగించడం లేదు అని మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ( Anil Deshmukh) అన్నారు. ప్రస్తుతానికి ముంబై పోలీసులు సుశాంత్ మృతి కేసును దర్యాప్తు చేస్తున్నారని.. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కి బదిలీ చేయడం లేదని అనిల్ దేశ్ ముఖ్ స్పష్టంచేశారు. సుశాంత్ మృతికి కొంతమంది బాలీవుడ్ ప్రముఖులే ( Bollywood celebrities ) కారణమని కొన్ని విమర్శలు, సుశాంత్ గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ( Rhea Chakraborty) అతడి ఆత్మహత్యకు కారకురాలు అని ఇంకొన్ని విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుశాంత్ మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ పలువురు ప్రముఖులు సైతం కేంద్రానికి లేఖ రాశారు. Also read: సుశాంత్ గాళ్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిపై కేసు నమోదు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుశాంత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో ఒకరైన అతడి గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కూడా సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను విజ్ఞప్తి చేశారు. ఇలా అన్నివైపుల నుంచి సుశాంత్ మృతిపై సిబిఐ విచారణకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ పాండే ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. Also read: Nepotism: ‘బాలీవుడ్‌లో నాకు గాడ్ ఫాదర్ లేరు.. కానీ’


ఇదిలావుంటే, మరోవైపు రియా చక్రవర్తి వల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొంటూ సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ తండ్రి కెకె సింగ్ ( KK Singh) పాట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కెకె సింగ్ ఫిర్యాదు మేరకు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పాట్నా సెంట్రల్ జోన్ పోలీసులు.. ఈ కేసు పూర్వాపరాలు తెలుసుకునేందుకు నలుగురు పోలీసుల బృందాన్ని ముంబైకి పంపించారు. Also read: Smoking vs COVID-19: సిగరెట్ తాగే అలవాటుందా ? ఐతే కరోనాతో కష్టమే!