CAA Controversy: సీఏఏను రాష్ట్రంలో అమలు చేయవద్దు, తళపతి విజయ్ తీవ్ర వ్యాఖ్యలు
CAA Controversy: దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి తీసుకురావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. సీఏఏ అమలుకు వ్యతిరేకంగా అందరూ గళం విప్పుతున్నారు. ఇప్పుడు తమిళ అగ్రనటుడు విజయ్ కూడా సీఏఏను వ్యతిరేకిస్తూ గళం విప్పారు.
CAA Controversy: 2019లో పార్లమెంట్ ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని సరిగ్గా లోక్‌సభ ఎన్నికలకు ముందు అమల్లోకి తీసుకురావడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. విదేశాల్నించి వచ్చిన వారిలో ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించడమే ప్రధానంగా వివాదానికి కారణమైంది. దేశవ్యాప్తంగా సీఏఏపై నాడు అల్లర్లు, నిరసనలు చోటుచేసుకున్నాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా అల్లర్లు, సమ్మెలు సద్దుమణిగాయి.
ఇప్పుడు దాదాపు ఐదేళ్ల విరామం తరువాత సీఏఏను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో చర్చ మొదలైంది. బీజేపీయేతర ప్రభుత్వాలు, ఇతరులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ సీఏఏపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలో అమలు చేయమని స్పష్టం చేశారు.
ఇప్పుడు తమిళ అగ్ర నటుడు, తమిళగ వెట్రి కళగం ఛీఫ్ తళపతి విజయ్ సైతం సీఏఏకు వ్యతిరేకంగా గళం విప్పారు. వివాదాస్పద పౌరసత్వ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయవద్దని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. ఈ చట్టాన్ని అమలు చేయడం లేదంటూ ప్రజలకు హామీ ఇవ్వాలన్నారు. ప్రజలంతా కలిసి మెలిసి జీవిస్తున్న వేళ వివాదాస్పద చట్టాన్ని అమలు చేయడం మంచిది కాదని విజయ్ స్పష్టం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీఏఏ అమలును తప్పుబడుతోంది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఎన్నికల బాండ్ల వ్యవహారంపై ప్రజల దృష్టి మరల్చేందుకే తెరపై తీసుకొచ్చారన్నారు. ఐదేళ్ల పాటు పెండింగులో పెట్టిన చట్టాన్ని హఠాత్తుగా అమలు చేయడం వెనుక ఉద్దేశ్యమేంటనే ప్రశ్నలు వస్తున్నాయి.
Also read: CAA 2019 Rules: పౌరసత్వం కోసం ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అర్హులు, ఏ కాగితాలు అవసరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook