Tamil Nadu Bus Accident: తమిళనాడులో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తమిళనాడులో యాత్రికులతో వెళ్తున్న టూరిస్ట్ బస్సు నీలగిరి జిల్లా కూనూరు మారపాలం వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడినట్టు కోయంబత్తూర్ జోన్ డీఐజి శరవణ సుందర్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో 54 మంది పర్యాటకులు బస్సులో ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. 30 మందికి పైగా క్షతగాత్రులు కూనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకొంతమంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమితనాడులోని నీలగిరి జిల్లా నుండి ఊటీకి వెళ్లే క్రమంలో
తెన్‌కాసి కడయం ప్రాంతం నుంచి ఉతకాయికి వచ్చే పర్యాటకులు ఉతకాయిని చూసేందుకు ఉటకై బయలుదేరి మెట్టుపాలాయం వెళుతుండగా కొయంబత్తూర్ జిల్లాలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం భారీ వర్షం కురుస్తున్న కారణంగా బస్సు అదుపుతప్పి లోయలో పడిందని తెలుస్తోంది. క్షతగాత్రులు అందరూ కూనూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 8 మంది మృతి చెందిన మాట వాస్తవమేనని కూనూరు ప్రభుత్వ ఆస్పత్రి జాయింట్ డైరెక్టర్ పళని స్వామి ధృవీకరించారు.


తెన్‌కాసి కడయం నుంచి వచ్చిన టూరిస్ట్ వాహనం కూనూర్ - మెట్టుపాళయం మధ్య ప్రమాదానికి గురైంది. ఇప్పటి వరకు 8 మంది చనిపోగా.. గాయపడిన వారిలో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. క్షతగాత్రులు కూనూర్ ప్రభుత్వ లాలీ ఆసుపత్రి, ఉతగై మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ప్రజా సంక్షేమ శాఖ మంత్రి సుబ్రమణ్యం వ్యక్తిగతంగా కూనురు ప్రభుత్వాస్పత్రిని సందర్శించి బాధితులను పరామర్శించనున్నారు అని కోయంబత్తూర్ జిల్లా అధికారవర్గాలు తెలిపాయి.