Separate Tamilnadu: మా డిమాండ్ తీర్చకపోతే.. తెరపైకి ప్రత్యేక దేశం
Separate Tamilnadu: తమిళనాట మరోసారి విభజన స్వరం విన్పిస్తోంది. తమిళనాడుకు చెందిన మాజీ కేంద్రమంత్రి, అధికార డీఎంకే ఎంపీ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక దేశం డిమాండ్ చేస్తామని హెచ్చరించారు.
Separate Tamilnadu: తమిళనాట మరోసారి విభజన స్వరం విన్పిస్తోంది. తమిళనాడుకు చెందిన మాజీ కేంద్రమంత్రి, అధికార డీఎంకే ఎంపీ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక దేశం డిమాండ్ చేస్తామని హెచ్చరించారు.
తమిళనాడు అధికార పార్టీ ఎంపీ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. డీఎంకే పార్టీకు చెందిన ఎంపీ రాజా ఓ బహిరంగ సభ సాక్షిగా..ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో చేసిన వ్యాఖ్యలివి. తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని కోరారు. లేకుంటే..ప్రత్యేక దేశం డిమాండ్ మళ్లీ తీసుకురావల్సి వస్తుందని హెచ్చరించారు. అన్ని రాష్ట్రాలతో కలిసి దేశాభివృద్ధికి పాటుపడాలనేదే తమ ఆకాంక్ష అని..కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితుల్లేవని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని తెలిపారు.
పెరియార్ సిద్ధాంతాలైన ప్రత్యేక తమిళనాడు అంశాన్ని మరోసారి తెరపై తెచ్చే పరిస్థితులు కల్పించవద్దని రాజా కోరారు. భారత రాజ్యాంగాన్ని గౌరవించి ఆ డిమాండ్ పక్కనబెట్టామని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం..రాష్ట్రా ప్రభుత్వాల హక్కుల్ని కాలరాస్తోందని మండిపడ్డారు ఎంపీ రాజా. స్వాతంత్య్రానికి ముందు, తరువాత కూడా తమిళనాడు స్వయం ప్రతిపత్తికై పోరాడుతూనే ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే హక్కుల్ని కాలరాస్తూ..పోరాడే పరిస్థితుల్ని కల్పించవద్దని ఏ రాజా కోరారు. తమిళనాడు అధికార పార్టీలో భాగంగా ఉన్నందుకు..లేదా ముఖ్యమంత్రి ఉన్నారనో ఈ వ్యాఖ్యలు చేయడం లేదన్నారు. ఎంపీ రాజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.
Also read: Kullu Bus Accident: లోయలో పడ్డ బస్సు... స్కూల్ పిల్లలతో సహా 16మంది దుర్మరణం!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోం
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook