Tamilnadu Kallakurichi consuming Toxic liquor tragedy: తమిళనాడు లోని కల్తీ మద్యం కాటుకు 25 మంది దుర్మరణం పాలయ్యారు. కళ్లకురిచి జిల్లాలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. కల్తీ మద్యం తాగి 25 మంది చనిపోగా, మరో 60 మందికి పైగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. దీనిపై సీఎం స్టాలీన్ సీరియస్ అయ్యారు. ఘటనపై జిల్లా జిల్లా కలెక్టర్ ఎంఎస్ ప్రశాంత్ కు ఫోన్ చేసి ఆరాతీశారు.  ఈ  క్రమంలో ఘటన జరిగిన విషయాలను, కారణాలను స్వయంగా ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తొంది. మరోవైపు  మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Snakes: పాము శరీరంలోని ఈ భాగం అస్సలు వదలోద్దు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులౌతారు..


స్థానిక కళ్లకురిచి జిల్లా పరిధిలోని పలు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందిచాలని కూడా సీఎం అధికారులను సూచించారు. అదే విధంగా..  కళ్లకురిచ్చి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని జిల్లా కలెక్టర్ స్వయంగా పరామర్శించారు. బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కళ్లకురిచ్చిలో మద్యంఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. స్థానికంగా మద్యం ప్యాకెట్లను  అమ్మినటువంటి, వ్యాపారి 49 ఏళ్ల కె. కన్నుకుట్టిని అరెస్టు చేశారు.  అతని నుంచి స్వాధీనం దాదాపు 200 లీటర్ల కల్తీ మద్యంను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.


ఈ నేపథ్యంలో పోలీసుల  విచారణలో మద్యం విక్రయించిన వాటిలో ప్రాణాంతక 'మీథేన్' వాడారనే విషయం వెలుగులోకి వచ్చింది.  ఈ ఘటన తర్వాత స్థానిక కలెక్టర్, ఎస్పీలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు.. కళ్లకురిచ్చిలో కల్తీ మద్యం సేవించి పలువురు మరణించారనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు.


 ఈ ఘటనపై సీబీసీఐడీ తో విచారణ జరిపిస్తామని వెల్లడించారు. దీంతోపాటు ఈ కేసులో నేరానికి పాల్పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని, ఈ వ్యవహారంలో విఫలమైన అధికారులపై కూడా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై పోలీసులకు ఫిర్యాదులు చేయాలన్నారు. వీరి వివరాలు గోప్యంగా ఉంచుతామని కూడా సీఎం పేర్కొన్నారు.  


తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి కూడా మృతులకు సంతాపం వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. గతంలో కూడా దేశంలో అనేక చోట్ల కల్తీ మద్యంలు తాగి చనిపోయిన ఘటనలు వార్తలలో నిలిచాయి. తాజాగా, ఈ ఘటన మాత్రం ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసేదిగా మారింది.


Read more: Viral video: బాప్ రే.. సింహం నాలుకకు యాపిల్ వాచ్.. వైరల్ గా మారిన వీడియో ఇదే..


ఈ నేపథ్యంలో.. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. ఈ ఘటన వెనుకు ఎవరున్న వదిలేది లేదంటూ అధికారులు తెల్చిచెప్పారు.  మరోవైపు బాధితులు మాత్రం తమకు న్యాయం చేయాలని, ప్రభుత్వం తరపున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter