Tauktae Cyclone Effect: తౌక్టే తుపాను బీభత్సాన్ని మిగిల్చింది. ముంబై మహా నగరాన్ని విధ్వంసానికి గురి చేసింది. అతి తీవ్రతుపానుగా మారిన తౌక్టే..తీరం దాటుతూ భారీ నష్టాన్ని మిగిల్చింది. ముంబై నగరం తౌక్టే దెబ్బకు అతలాకుతలమైపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అరేబియా సముద్రంలో(Arabian Sea)ఏర్పడిన అల్పపీడనంతో ప్రారంభమై..అతి తీవ్ర తుపానుగా మారి పెను విధ్వంసం సృష్టించింది. తౌక్టే తుపాను భీభత్సంతో ముంబైతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీవర్షాలు, ఈదురు గాలులు వీచాయి. తౌక్టే తుపాను (Taukte Cyclone)గుజరాత్ తీరం వైపు కదులుతున్న క్రమంలో భారీ నష్టం కలిగింది. తుపాను కారణంగా భారీ ఈదురుగాలులు ముంబై నగరాన్ని తాకాయి. నగరంలోని అతిపెద్ద వ్యాక్సినేషన్ సెంటర్ బీకేసీ భారీ నష్టాన్ని చవిచూసింది. ముంబైలో తుపాను కారణంగా 230 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మే నెలలో 24 గంటల వ్యవధిలో ఇంతటి భారీ వర్షమనేది ఇదే తొలిసారి అని తెలుస్తోంది. 


భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా ముంబైలోని వివిధ ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లన్నీనీటితో నిండిపోయాయి. నగరమంతా భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు కొనసాగుతున్నాయి. రానున్న 24 గంటల్లో మరింతగా వర్షపాతం, గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ (IMD)హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా వీధుల్లో నీరు నిలిచిపోయి చెరువుల్ని తలపించాయి. ఈస్ట్ - వెస్ట్ కనెక్టివిటీకి కీలకమైన హింద్మాతా జంక్షన్, అంథేరి సబ్వే, మలాడ్ సబ్వేతో సహా ఆరు లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షం నీరు నిలిచిపోయింది.తుపాను కారణంగా ముంబై, బాంద్రాలోని బాంద్రా-వర్లి సముద్ర లింక్ మూసివేశారు. భారీ వర్షాల కారణంగా పలు రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. మొత్తానికి తౌక్టే తుపాను ముంబై ( Mumbai) మహా నగరంలో పెను విధ్వంసాన్ని మిగిల్చింది.


Also read: The Lancet Report: కరోనా సోకితే..ఇంట్లో వైద్యమే అన్నింటికంటే ఉత్తమం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook