Tear Gas Attack: భారత పార్లమెంట్ భద్రతా వైఫల్యం మరోసారి స్పష్టంగా కన్పించింది. సమావేశాలు జరుగుతున్న సమయంలో లోక్‌సభలో ఇద్దరు అంగతకులు చొరబడ్డారు. విజిటర్స్ గ్యాలరీ నుంచి చొరబడి టియర్ గ్యాస్ ప్రయోగంతో భయభ్రాంతులకు గురి చేశారు. సెక్యూరిటీ సిబ్బంది ఆ ఇద్దరినీ అదుపులో తీసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సరిగ్గా 22 ఏళ్ల క్రితం భారత పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడి ఘటన ఎవరూ మర్చిపోలేనిది. ఇప్పుుడు మరోసారి అలాంటి వాతావరణం కన్పించింది. నూతన పార్లమెంట్ భవనంలో భద్రతా వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో ఈ ఘటనతో అర్ధమౌతుంది. లోక్‌సభ సమావేశాలు జరుగుతుండగా ఇద్దరు దుండగులు విజిటర్స్ గ్యాలరీ నుంచి ఎంపీలు కూర్చునే హాల్లోకి జంప్ చేశారు. ఊహించని ఈ ఘటనతో ఉలిక్కిపడిన ఎంపీలు తేరుకునేలోగా ఆ ఇద్దరూ టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాంతో భయభ్రాంతులకు గురైన ఎంపీలు బయటకు పరుగులు తీశారు. లోక్‌సభలో జీరో అవర్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమై సెక్యూరిటీ సిబ్బంది ఆ ఇద్దరినీ అదుపులో తీసుకున్నారు. ఆ ఇద్తరు ఎవరు, ఎందుకీ పనిచేశారు, ఆసలా వ్యక్తుల చేతుల్లో టియర్ గ్యాస్ ఎలా చేరిందనే వివరాలు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నేపధ్యంలో సభను వాయిదా వేశారు.



గ్యాలరీ నుంచి దూకి టియర్ గ్యాస్ వదిలి ఇద్దరిలో ఒకరు అబ్బాయి కాగా మరొకరు అమ్మాయి. అబ్బాయి పేరు అమోల్ షిండేగా, అమ్మాయిని నీలంగా గుర్తించారు. కాళ్లకు వేసుకున్న బూట్లలో టియర్ గ్యాస్ క్యాన్లు దాచుకున్నారని తెలిసింది. ఇది కచ్చితంగా భద్రతా వైఫల్యమేనని లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి విమర్శించారు. 


Also read: CBSE Exams Schedule: సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల, ఎప్పట్నించంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook