Telangana Covid-19: రెండున్నర లక్షలు దాటిన కోలుకున్న వారి సంఖ్య
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే గత కొన్నిరోజుల నుంచి రాష్ట్రంలో 1000 కి చేరువలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 900లకు చేరువలో కేసులు నమోదయ్యాయి.
Coronavirus Updates in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే గత కొన్నిరోజుల నుంచి రాష్ట్రంలో 1000 కి చేరువలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 900లకు చేరువలో కేసులు నమోదయ్యాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసుల కన్నా కోలుకుంటున్న వారి సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో ( నవంబరు 21న ) శనివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 873 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నలుగురు (4) మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,63,526 కి చేరగా.. మరణాల సంఖ్య 1,426 కి పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
గత 24గంట్లలో ఈ వైరస్ నుంచి 1,296 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా (Telangana) కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,50,453 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 11,643 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 94.03 శాతం ఉండగా.. మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. Also read: Tarun Gogoi: అస్సాం మాజీ ముఖ్యమంత్రి గొగోయ్ పరిస్థితి విషమం
ఇదిలావుంటే.. శనివారం తెలంగాణ వ్యాప్తంగా 41,646 కరోనా పరీక్షలు చేశారు. వీటితో కలిపి నవంబరు 21వ తేదీ వరకు మొత్తం 51,34,335 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా.. హైదరాబాద్ పరిధిలో 152 కేసులు నమోదయ్యాయి.
[[{"fid":"198737","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."}},"link_text":false,"attributes":{"alt":"telangana corona cases bulletin ","title":"తెలంగాణలో కరోనా కేసులు..","class":"media-element file-default","data-delta":"1"}}]]
Also read: Sonu Sood: ఆచార్య సెట్స్‌లో రియల్ హీరో సోనూసూద్‌కు సత్కారం
Avantika Mishra: అవంతిక మిశ్రా బ్యూటిఫుల్ పిక్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి