Hyderabad Police Case registered against BJP MP Tejaswi Surya: హైద‌రాబాద్‌: బీజేపీ ఎంపీ తేజ‌స్వి సూర్య‌ ( Tejaswi Surya ) పై హైద‌రాబాద్ పోలీసులు (Hyderabad Police) కేసు న‌మోదు చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివ‌ర్సిటీలోకి అనుమ‌తి లేకుండా ప్ర‌వేశించినందుకు (Case registered) ఆయ‌న‌పై కేసు న‌మోదు అయ్యింది. ముందస్తుగా యూనివ‌ర్సిటీ అధికారుల నుంచి ఎంపీ తేజస్వి సూర్య అనుమ‌తి పొంద‌కుండా క్యాంపస్‌లోకి ప్రవేశించారని పోలీసులు పేర్కొన్నారు. దీనిపై యూనివ‌ర్సిటీ రిజిస్ట‌ార్ ఫిర్యాదు మేరకు ఎంపీ తేజస్వి సూర్యపై కేసు నమోదు చేసినట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి గురువారం పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్ 447 (criminal trespass) కింద సూర్యపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.  Also read: CM KCR: తెలంగాణలో మత విద్వేశాలకు కుట్ర: సీఎం కేసీఆర్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"199248","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"తేజస్వి సూర్య","field_file_image_title_text[und][0][value]":"బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"తేజస్వి సూర్య","field_file_image_title_text[und][0][value]":"బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య"}},"link_text":false,"attributes":{"alt":"తేజస్వి సూర్య","title":"బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య","class":"media-element file-default","data-delta":"2"}}]]జీహెచ్ఎంసీ ఎన్నికల (ghmc elections 2020) ప్రచారంలో భాగంగా బీజేపీ (BJP) యువ మెర్చా జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య మంగళవారం బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలతో కలిసి ఉస్మానియా యూనివర్సిటీ వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు వెంటనే ఎన్‌సీసీ గేట్ దగ్గర ఆయన్ను అడ్డుకున్నారు. లోపలికి అనుమతి లేదంటూ వారిని అడ్డుకోగా.. బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. చివరకు అందరినీ లోపలకు అనుమతించిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడ్డారు. Also read: GHMC Elections 2020: 28న సీఎం కేసీఆర్ ప్రచార సభ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe